Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

పెరిగిన ఎగవేతదారులు

2

 *  డిసెంబర్ ముగింపునాటికి 1.7 శాతం పెరిగిన సంఖ్య   *  పిఎస్‌యు బ్యాంకుల్లో రూ. లక్ష కోట్లకు పైనే మొండిబకాయిలు: కేంద్రం

న్యూఢిల్లీ: రుణాలను చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్న ఉద్దేశపూర్వక ఎగవేతదారుల సంఖ్య పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(201718) ఏప్రిల్ నుంచి డిసెంబర్ నాటికి ఎగవేతదారుల సంఖ్య 9,063 మందితో 1.66 శాతం పెరిగిందని ప్రభుత్వం వెల్లడించింది. వీరు ఎగవేసిన రుణాల మొత్తం రూ.1,10,050 కోట్లు(1.1 ట్రిలియన్లు) ఉంటుందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి ప్రతాప్ శుక్లా లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. తొమ్మిది నెలల వ్యవధిలో ఉద్దేశపూర్వక ఎగవేతదారుల సంఖ్య 9,063 మందితో 1.66 శాతం పెరిగిందని ఆయన చెప్పారు. ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) మార్గదర్శకాల మేరకు ఎగవేతదారులపై క్రిమినల్ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఉద్దేశపూర్వక ఎగవేతదారుల కంపెనీలపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కూడా ఆంక్షలు విధించిందని, క్యాపిటల్ మార్కెట్ల నుంచి నిధుల సేకరణలో ప్రమోటర్లపై నిబంధనలు విధించిందని అన్నారు. 2017 డిసెంబర్ 31 నాటికి ప్రభుత్వరంగ బ్యాంకులు దాదాపు 2,108 మంది మొండి బకాయిదారులపై ఎఫ్‌ఐఆర్, 8,462 మందిపై దావా వేసిందని శుక్లా వెల్లడించారు. 2016 మార్చి ముగింపునాటికి ప్రభుత్వరంగ బ్యాంకులు రూ. 2,30,287 కోట్ల రుణాలను రద్దు చేశాయని మరో ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.
అచేతన స్థితిలో బ్యాంకింగ్ వ్యవస్థ : కోటక్ మహీంద్ర ఎండి ఉదయ్ కోటక్
భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ అచేతన స్థితిలో ఉందని, దేశానికి సమర్థవంతమైన ఆర్థిక వ్యవస్థ అవసరమని కోటక్ మహీంద్రా ఎండి ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. ప్రస్థుత బ్యాంకింగ్ వ్యవస్థ సరిదిద్ధాల్సి ఉందని, ఇలాంటి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం.. రూ.13 వేల కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం వెలుగుచూసిన నేపథ్యంలో ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ప్రభుత్వరంగ బ్యాంకులను తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు.

Comments

comments