Home జాతీయ వార్తలు జూరాలకు పెరిగిన వరద ఉధృతి

జూరాలకు పెరిగిన వరద ఉధృతి

Juralaమహబూబ్‌నగర్ : కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు వారం రోజులుగా వరద ఉధృతి పెరిగింది. జూరాల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 57,500 క్యూసెక్కులకు చేరింది. రెండు గేట్లను రెండు మీటర్ల మేర ఎత్తి 65,650 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నారు. జూరాల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని ఆరు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి 48 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ప్రాజెక్టు ప్రధాన కుడి కాలువకు 150 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 300 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.