Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

దేశంలో పెరిగిన అసహనం : సోనియా

Sonia-Gandhi

ఢిల్లీ : ఎన్‌డిఎ హయాంలో దేశంలో అసహనం పెరిగిపోయిందని జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఇండియా టుడే -2018 కాంక్లేవ్ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సోనియా మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోడీ పాలనలో విపక్షాలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆమె ఆరోపించారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని ఆమె మండిపడ్డారు. పార్లమెంట్‌ను మూసేస్తే, తాము ఇంటికి వెళ్లిపోతామని ఆమె ఎద్దేవా చేశారు. దేశంలో మత ఘర్షణలు ఎక్కువవుతున్నాయని ఆమె విమర్శించారు. వాజ్‌పేయి హయాంలో జరిగిన విధంగా మోడీ హయాంలో పార్లమెంట్ కార్యకలాపాలు గౌరవప్రదంగా జరగడం లేదని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం దేశం తిరోగమన దిశలో ఉందన్నారు. భారత న్యాయ వ్యవస్థ కూడా ప్రస్తుతం సంక్షోభంలో ఉందని ఆమె తెలిపారు. తమపై చేస్తున్న అవినీతి ఆరోపణలను చాలా ఎక్కువ చేసి చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయలను, చర్చలను అంగీకరించాలే తప్ప ఏకపాత్రభినయాన్ని కాదని ఆమె అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే విషయం పార్టీ నిర్ణయిస్తుందని సోనియా తెలిపారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Increased Intolerance in the Country : Sonia

Comments

comments