Home తాజా వార్తలు కొండెక్కిన కోడి ధరలు

కొండెక్కిన కోడి ధరలు

Increased the Chicken Prices in Telangana

హైదరాబాద్ : కోడి ధరలు కొండెక్కాయి. పెరిగిన ధరలతో ప్రజలు చికెన్‌ను తినలేని పరిస్థితి నెలకొంది. ఎండలు భగ్గుమంటుండడంతో 15శాతం కోళ్లు పౌల్ట్రీలలోనే మృతి చెందుతున్నాయి. ఎండలకు తోడు పెళ్లిల సీజన్ కావడంతో చికెన్‌కు డిమాండ్ పెరిగింది. గత వారం వరకు కిలో చికెన్ ధర రూ.160లు ఉండగా, ప్రస్తుతం కిలో చికెన్ ధర రూ.220లకు పైగా ఉంది. చికెన్ ధరలు పెరిగిపోవడంతో చికెన్ సెంటర్లు వెలవెలబోతున్నాయి. ఈనెల 17 నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుంది. దీంతో చికెన్‌కు మరింత డిమాండ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Increased the Chicken Prices in Telangana