Home ఎడిటోరియల్ ప్రమాదకరంగా పెరుగుతున్న సైబర్ నేరాలు

ప్రమాదకరంగా పెరుగుతున్న సైబర్ నేరాలు

CYBER-CRIME22దేశంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. దీనిగురించి కేంద్రప్రభుత్వం తీవ్రంగా ఆందోళన చెందుతోంది. అభివృద్ధి చెందిన దేశాలతోపాటు అభివృద్ధి దిశగా పయనిస్తున్న భారత్‌లో కంప్యూటర్-ఇంటర్‌నెట్ సంబంధిత నేరాల ప్రవృత్తి తీవ్రంగా ఉండటంవల్ల సమస్య జటిలంగా మారింది. సైబర్ నేరాలు ప్రధానంగా మహిళలు, యువతులు, యువ కులు, పిల్లలపై దుష్పభావం చూపుతున్నా యని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారానికి తగు సూచనలను ఇవ్వాలని, ఈ నేరాల విషయంలో కొనసాగాల్సిన పరిశోధనలు, ఏర్పాటు కావలసిన మౌలిక సదు పాయాలు, ప్రభుత్వ సంస్థలు తీసుకోవాల్సిన జాగ్రత్త లను సూచించాలని కోరారు. దేశంలో సైబర్ నేరాల గురించి నిపుణులు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంత్రి సమక్షంలో ఉన్నతాధి కారులకు సెప్టెంబర్ 12వ తేదీన ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. దీంతోపాటు ఈ నేరాలను అదుపు చేసేందుకు కేంద్రం తీసు కోవాల్సిన చర్యలపై సిఫార్సులతో కూడి న నివేదికను కూడా నిపుణుల కమిటీ హోంమంత్రికి అంద జేసింది. గత ఏడాది డిసెంబర్ 24వ తేదీన కేంద్రం ఐదుగురు నిపుణులతో కూడిన కమిటీని నియమించి సైబర్ సమస్యలను అధ్యయనం చేసి, తగు సిఫార్సు లను ఇవ్వాలని ఆ నిపుణుల కమిటీ ఆదేశించింది.
ఏటా 40శాతం నేరాలు పెరుగుదల
భారత్‌లో ఏటా 40శాతం చొప్పున పెరుగు తున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు రూ.500కోట్ల అంచనా వ్యయంతో జాతీయస్థాయి సంస్థను ఏర్పాటు చేయాలని నిపుణుల కమిటీ మొదటి సిఫార్సు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలో ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) అనే సంస్థను ఏర్పాటు చేయాలి. దీన్ని వివిధ రాష్ట్రాల లోని 15,000పోలీసు స్టేషన్లతో అను సంధానం చేయాలి. దీని ఆధ్వర్యంలోనే పోలీసు అధికారులకు సైబర్ నేరాల నియంత్రణ గురించి ఆధునిక సాంకే తిక విజ్ఞానం పై తగిన శిక్షణ ఇవ్వాలి. డేటా బేస్ అయిన నాట్ గ్రిడ్, సీసీటిఎనెస్ సంస్థలతో అను సంధానమై దేశంలోని వివిధ రాష్ట్రాల లోని నేరాలు, నేరస్థుల సమాచారాన్ని సేకరించాలి. విదేశీ ఇంటర్‌నెట్ సర్వర్లపై ఆధారపడ కుండా కేంద్ర రాష్ట్రాలకు అనువుగా ఉండే గేట్-వేని ఏర్పాటు చేయాలి. సోషల్ మీడియాను ఓ కంట కనిపెడుతూ కీలక రంగాలు అయిన రక్షణ, భద్రత, అణు రంగా లతోపాటు ప్రభుత్వ సంస్థల కార్య క్రమా లపై నిఘా ను పెంచాలి. ప్రభుత్వ సమాచారాన్ని హాక్ చేసే జాతీయ అంతర్జాతీయ హాకింగ్‌లపై నిఘా ఉంచా లని నిపుణుల కమిటీ కేంద్రానికి సూచిం చింది.
స్టాండింగ్ కమిటీ సిఫార్సులు
ఎంతో జటిలమైన సైబర్ నేరాలపై ఐటీ స్టాండింగ్ కమిటీ కూడా సిఫార్సులు చేసింది కేంద్రా నికి. కంప్యూటర్ నేరాలలో 20రకాల నేరాలు అత్యంత ప్రధానమైనవని ఐటీశాఖ-స్టాండింగ్ కమి టీ నిర్థారించింది. కోర్ రంగాలయిన విద్యుత్, అణు, అంతరిక్షం, ఏవియేషన్, రవాణా రంగాలను సైబర్ నేరాల నుంచి రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రస్తుతం కేంద్రస్థాయిలో పర్యవేక్షణ విభాగం గానీ, నియంత్రణ కేంద్రంగానీ లేదు. వివిధ ప్రభుత్వ విభాగాలలో ఈ విభాగాలు విడివిడిగా పనిచేస్తు న్నాయి. వీటికి బదులు కేంద్రస్థాయిలో ఒక నియం త్రణ విభాగాన్ని కేంద్రం ఏర్పాటు చేయాలని కోరింది. నేరాల నియంత్రణకు పెద్ద ఎత్తున నిపుణు లను నియమించాలని, శిక్షణా కార్యక్రమాలను నిర్వ హించాలని కూడా సూచించింది. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఐటీ చట్టం-2000, నేషనల్ సెక్యూరిటీ పాలసీ 2013ను సవరించాలని సూచించింది. సైబర్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆవశ్యకతను గుర్తు చేసింది.
ఇవే కేసులు
దేశంలో అత్యంత వేగంగా సైబర్ నేరాలు పెరుగు తున్నాయి.వీటి విషయంలో మహారాష్ట్ర, యూపీ, కర్నాటక రాష్ట్రాలు మొదటి మూడు స్థానాలలో ఉన్నాయి. నాలుగోస్థానం తెలంగాణాది. కాగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా నేరాలు క్రమంగా పెరుగు తున్నాయి. మహారాష్ట్రలో 2013లో 907 నేరాలు నమోదు అయ్యాయి. 2014లో 1879 నేరాలు రిజిష్టర్ అయ్యాయి. ఇదే విధంగా ఉత్తరప్రదేశ్‌లో 2013లో 682, 2014లో 1737కేసులు నమోదు అయ్యాయి. మూడోస్థానంలో ఉన్న కర్నాటకలో 2013లో 533, 2014లో 1020కేసులు నమోదు కాగా అరెస్టయిన వారిసంఖ్య వరుసగా 104; 372. 2013వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా 5693 కేసులు, 2014లో 9622కేసులు నమోదు అయ్యా యి. ఆ రెండు సంవత్సరాలలో 9043 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
నీలిచిత్రాల ప్రభావం
ఇంటర్‌నెట్‌లో నీలిచిత్రాలు చూడటం, వాటిని వ్యాప్తిచేయడం, అమ్మాయిలను బ్లాక్‌మెయిల్ చేయడం వంటి నేరాలతోపాటు ఇతర సైబర్‌నేరాలు నిత్యమూ వార్తామాధ్యమాలలో ప్రముఖ స్థానాలను ఆక్ర మిస్తున్నాయి. సోషల్ మీడియా అయిన ఫేస్ బుక్, ట్విట్టర్, ఈమెయిల్స్, వాట్సాప్ వంటి మాధ్య మాల ను సానుకూల వైఖరితో కొందరు ప్రయోజ నకర పనులకు ఉపయోగిస్తుండగా పలువురు ఈ మాధ్యమాలను దుర్వినియోగం చేస్తున్నారు. సోషల్ నెట్ వర్క్‌లలో అమ్మాయిలను వలలో వేసేందుకు అబ్బా యిలు చేసే ప్రయత్నాలు కూడా సర్వ సాధారణం అయ్యాయి. సైబర్ నేరాలవల్ల అమాయ కులైన అమ్మాయిల జీవితాలు బలి అయిన సంఘట లను పత్రికలలో చూస్తుంటాము. కీలక వ్యక్తుల రహస్య సమాచారం, సంస్థలు, ప్రభుత్వ రికార్డులు హాకింగ్ అయినట్లు వచ్చే వార్తలు సమస్యను ఎత్తిచూపుతున్నాయి. సైబర్ నేరాలవల్ల 46 మిలియన్ల మందిపై ఈ నేరాల ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు తగిన వ్యవస్థ రూపుదిద్దుకోవాలి. నిపుణుల సూచనల మేరకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సైబర్ నేరాలను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకోవాలి. అవసర మైతే ఐటీ, ఐపీసీలను మార్చడానికి కృషి చేయాలి. ఆధునిక సాంకేతిక విజ్ఞానం మానవాళి సంక్షేమా నికి, ప్రయోజనాలకు ఉపయోగపడాలే గానీ నెగిటివ్ పోకలకు దోహదపడరాదు.