Home జిల్లాలు పెరుగుతున్న రోగం-అందని వైద్యం

పెరుగుతున్న రోగం-అందని వైద్యం

hospitalనిజామాబాద్ ప్రతినిధి : జిల్లాలో రో జురోజుకు వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతోంది. ఇంచార్జ్ పాలనలో రోగాల జాతర సాగుతోంది. మరో పక్క ఎఎన్ ఎమ్‌ల సమ్మె, మందుల కొరత జిల్లాలో వ్యాధిగ్రస్తులను మరిన్ని అవస్థలకు గురిచేస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే రోజుకు 15 వందలకు పైగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో 2వేలకు పైగా వెళుతుండగా ఎక్కడికి వెళ్ళకుండా సొంత వైద్యాన్ని నమ్ముకొని రోజుకు వెయ్యి మంది రోగాల బారిన పడుతు న్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందించడంలో కీలక పాత్ర పోషించే ఎఎన్‌ఎమ్‌లు సమ్మెలో ఉండటంతో గ్రామాల్లో మందుల సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోం ది. స్థానిక ఆస్పత్రుల్లో తగిన సిబ్బంది లేక రోగులకు వైద్య సేవలు అందండంలో జాప్యం జరుగుతోంది. సాక్షాత్తూ కలెక్టర్ హెచ్చరించినా ఫలితం శూన్యం.
జిల్లాలో ఇదీ తీరు
జిల్లాలో ఏరియా ఆస్పత్రులు తొమ్మిది కాగా, 42 పీహెచ్‌సి, సీహెచ్‌సిలలో ప్రభుత్వ వైద్య సేవలున్నాయి. ప్రతి రోజు ఏరియా ఆస్పత్రులకు రోజూ 950 నుంచి 1050 వరకు రోగులు రాగా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 540 నుంచి 600 మంది వరకు రోగులు వస్తున్నారు. సాధారణ సమ యాల కంటే ఈ సీజన్‌లో రెండింతల మంది రోగులు వ్యా ధుల బారినపడి ఆస్పత్రులకు వస్తున్నారు. ప్రధానంగా డయేరియా, మలేరియా వ్యాధులు ఎక్కువగా ప్రబలుతు న్నాయి. ఇదిలా ఉంటే జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో 2వేల నుంచి 2150 మంది వ్యాధులతో చికిత్స కోసం వస్తు న్నట్లు అధికారులు లెక్కలు చూపుతున్నారు. వీరి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మరోపక్క ఆర్థిక కారణాలతో పాటు సరైన సౌకర్యాలు లేక వేల మంది ఆస్పత్రులకు వెళ్ళకుండానే స్థానిక పీ.ఎం.పి లేదా, ఆర్.ఎం.పిల వద్ద చికిత్స చేయించుకోవడం, లేదా సొంత వైద్యం చేసుకుని ఇంటి పట్టున ఉంటున్నారు. ఇంటీవల జిలాల కలెక్టర్ యో గితా రాణా క్షేత్ర పర్యటనకు వెళ్ళినప్పుడు ఇలాంటివి ఎన్నో సంఘటనలు బయట పడటం విశేషం. ప్రస్తుతం అధి కారులు చెబుతున్న లేక్కల ప్రకారం రోజు నాలుగు వేలకు పై జనం వివిధి వ్యాధల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది.
సమ్మెలో ఎఎన్‌ఎమ్‌లు
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న ఎఎన్‌ఎమ్‌లను రెగ్యూలర్ చేయాలని డిమాండ్ చేస్తూ, గత పది రోజులుగా సమ్మెలో ఉన్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో రెగ్యూలర్ చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాల ని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. జిల్లాలో 424 మంది ఎఎన్‌ఎమ్‌లు సమ్మెలో ఉండటంతో పీహెచ్‌సిలు, సబ్ సెంటర్ల పరిధిలో మందుల పంపిణీ, వైద్యసేవలు అందడం లో జాప్యం జరుగుతోంది. కనీసం ఎఎన్‌ఎమ్‌ల సమ్మెను విరమింపజేస్తే సకాలంలో గ్రామాల్లో మందుల పంపిణీ అయినా జరుగుతోందని రోగులు కోరుతున్నారు.
ఇంచార్జ్ పాలన
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పోస్టు గత సంవత్సర న్నర కాలంగా ఖాళీగా ఉంది. జిల్లా వైద్య, ఆరోగ్య అధి కారిగా పనిచేసిన బసవేశ్వరి, సంవత్సర మున్న క్రితం పది వి విరమణ పొందారు. ఆమె స్థానంలో నవీపేట్ ఎస్‌హె చ్‌ఓగా పని చేస్తున్న వెంకట్‌ను ఇంచార్జ్ డీఎం అండ్ హెచ్‌ఓగా కొనసాగించారు. అప్పటి నుంచి వైద్య శాఖ ఇంచార్జ్ పాలనలోనే కొనసాగడం విశేషం. దీనికి తోడు 42 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 12 కేంద్రాల్లో ఇప్పటి వరకు పూర్తి కాలం వైద్యాధికారులు లేరు. సకాలంలో అక్కడ వైద్యసేవలు అందించడం సమస్యగా మారింది. దీనికి తోడు పీహెచ్‌సిలలో పనిచేస్తున్న వైద్యులు ఎక్కువ మంది మధ్యాహ్నం వరకు మాత్రమే అందుబాటులో ఉండి, ఆ తరువాత తమ స్వంత క్లినిక్‌లల్లో వైద్యసేవలు అందించడం రోగులకు మరింత సమస్యగా మారింది.
కలెక్టరే స్పందించాలి
జిల్లాలో ప్రబలుతున్న రోగాలపై జిల్లా కలెక్టరే స్పందిం చాలని రోగులు కోరుతున్నారు. ఇటీవల జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన కలెక్టర్ యోగితా రాణా ఆకస్మీకంగా తనిఖీ చేసి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రి విధులకు డుమ్మా కొట్టిన వైద్యులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ తరువాత వర్ని, బీర్కూర్ ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసి రోగులకు అందుతున్న సేవలపై అమె అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. మరోసారి జిల్లాలో వైద్య సేవలపై జిల్లా కలెక్టర్ స్పందించి రోగాలకు సకాలంలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.