Home తాజా వార్తలు ఖలేజా చూపిన ఖవాజా…. ఆసీస్‌దే సిరీస్

ఖలేజా చూపిన ఖవాజా…. ఆసీస్‌దే సిరీస్

 

ఢిల్లీ: ఐదో వన్డేలో భారత జట్టు ఘోరంగా ఓటమి పాలవడంతో సిరీస్‌ను కోల్పోయింది. ఈ సిరీస్ ను టీమిండియా 2-3 తేడాతో  ఓటమిని చవిచూసింది. భారత జట్టు వరసగా మూడు వన్డేలో ఓటమిపాలైంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 273 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 50 ఓవర్లలో 237 పరుగులు చేసి 35 పరుగుల తేడాతో ఓడిపోయింది. విరాట్ కోహ్లీ (20), శిఖర్ ధావన్ (12) తొందరగా ఔట్ కావడంతో ఆదిలోనే భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. మిడిలార్డర్‌లో వచ్చిన రిషబ్ పంత్(16), విజయ శంకర్(16) బ్యాటింగ్‌లో ఫెయిల్ కావడంతో ఘోర పరాజయం పాలైంది. రోహిత్ శర్మ 89 బంతుల్లో 56 పరుగులు చేసి జంపా బౌలింగ్ లో స్టంపౌట్ రూపంలో ఔటయ్యాడు. ఏడో వికెట్‌పై  భువనేశ్వర్ కుమార్(46), జాధవ్ (44) 91 పరుగులు చేసి పర్వాలేదనిపించారు.  ఆసీస్ బౌలర్లలో జంపా మూడు వికెట్లు పడగొట్టగా, కమిన్స్, రిచర్డ్ సన్, స్టయిన్స్ తలో రెండు వికెట్లు తీయగా లయాన్ ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్ లో ఖవాజా సెంచరీ చేయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఐదు వన్డేలలో ఖవాజా 390 పరుగులు చేయడంతో ఖవాజాకు మ్యాన్ ఆఫ్ సిరీస్ వరించింది.  

 

Ind vs Aus: Australia Won ODI Series