Home తాజా వార్తలు ఇండియా లక్ష్యం 273

ఇండియా లక్ష్యం 273

Khawaja

 

ఢిల్లీ: ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న ఐదో వన్డేలో ఆసీస్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. భారత జట్టు ముందు 273 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో ఏ టీమ్ గెలిస్తే వారికే సిరీస్ సొంతమవుతుంది. ఖవాజా సెంచరీతో కదంతొక్కాడు. హ్యాండ్స్‌కోంబ్ (60 బంతుల్లో 52 పరుగులు) ఆఫ్ సెంచరీతో మెరిశాడు. ఫించ్ 43 బంతుల్లో 27 పరుగులు చేసి జడేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ఈ మ్యాచ్‌లో రెండో వికెట్‌పై ఖవాజా, హ్యాండ్స్‌కోంబ్ 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తొలి వికెట్‌పై ఖవాజా, ఫించ్ 76 పరుగలు భాగస్వామ్యం నెలకొల్పారు. మ్యాక్స్‌వెల్ ఒక పరుగు చేసి జడేజా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

టర్నర్ 20 బంతుల్లో 20 పరుగులు చేసి కులదీప్ యాదవ్ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. స్టయిన్స్ 20 పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో క్లీన్‌బౌల్డ్ రూపంలో ఔటయ్యాడు. కమ్నీస్ 15 పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో అతడికే క్యాచ్ ఇచ్చి మైదానం వదిలాడు. రిచర్డ్ సన్ 25 పరుగులు చేసి రనౌట్ రూపంలో వికెట్ పారేసుకున్నాడు. కారే మూడు పరుగులు చేసి షమీ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు తీయగా జడేజా,  షమీ చెరో రెండు వికెట్లు, కులదీప్ యాదవ్ ఒక వికెట్ తీశాడు. ఐదు వన్డేల సిరీస్ లో ఆసీస్, టీమిండియా చెరో రెండు మ్యాచ్ లు గెలిచి సమజ్జీలుగా ఉన్నారు.  ఈ మ్యాచ్ లో ఆసీస్ ఆటగాళ్లు 4 సిక్స్ లు, 26 ఫోర్లు కొట్టారు.

 

Ind vs Aus: India Target is 273 Runs in Delhi ODI