Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

విజయానికి వికెట్ దూరంలో టీమిండియా

Ishant-Sharma

నాటింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా విజయానికి వికెట్ దూరంలో నిలిచింది. విజయం కోసం 521 పరుగులు చేయాల్సిన ఇంగ్లండ్ మంగళవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో విజయం చేయాలంటే బుధవారం చివరి రోజు మరో 210 పరుగులు చేయాలి. భారత్‌కు గెలుపు కోసం ఒక వికెట్ కావాలి. చివరి రోజు ఫలితం తేలడం ఖాయం. ఇక, భారీ లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్‌కు ప్రారంభంలోనే గట్టి దెబ్బతగిలింది. ఇషాంత్ శర్మ అద్భుత బౌలింగ్‌తో ఓపెనర్లు అలిస్టర్ కుక్ (17), జెన్నింగ్స్ (13)లను పెవిలియన్ పంపించాడు. కెప్టెన్ జో రూట్ (13)ను బుమ్రా, పోప్ (16)లను షమి వెనక్కి పంపారు.

దీంతో ఇంగ్లండ్ 84 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకు పోయింది. ఈ దశలో జోస్ బట్లర్, బెన్ స్టోక్స్ అసాధారణ పోరాట పటిమతో భారత బౌలర్లను హడలెత్తించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన బట్లర్ 21 ఫోర్లతో 106 పరుగులు చేశాడు. స్టోక్స్ ఆరు ఫోర్లతో 62 పరుగులు చేశాడు. కుదురుగా ఆడుతున్న బట్లర్‌ను బుమ్రా వెనక్కి పంపాడు. ఆ తర్వాత బైర్‌స్టో (౦), వోక్స్ (4) లను కూడా బుమ్రా ఔట్ చేశాడు. అయితే చివర్లో ఆదిల్ రషీద్ 22 (నాటౌట్), అండర్సన్ 16 (నాటౌట్) పోరాటం చేయడంతో ఇంగ్లండ్ నాలుగో రోజు ఓటమి పాలుకాకుండా గట్టెక్కింది.

Comments

comments