Home తాజా వార్తలు ఆలీవ్ హోటల్ పై దాడి…. అసభ్య నృత్యాలు…

ఆలీవ్ హోటల్ పై దాడి…. అసభ్య నృత్యాలు…

Dance-Bar

అమరావతి: విజయవాడలోని భవానీపురంలో గురువారం వేకువజామున మూడు గంటల ప్రాంతంలో ఆలీవ్ ట్రీ హోటల్‌పై పోలీసులు దాడి చేశారు. మహిళలతో అసభ్య నృత్యాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో ఐదుగురు మహిళలతో సహా 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అధికారి పార్టీకి చెందిన ఓ నేత ముఖ్యఅనుచరుడి ఆధ్వర్యంలో పార్టీ జరుగుతుందని సమాచారం. హైదరాబాద్‌కు చెందిన ప్రైవేటు ఈవెంటు యాంకర్లను తీసుకొచ్చి అర్ధ నగ్న నృత్యాలు చేయించారు. దాడి జరుగుతున్నపుడు మరో ఐదుగురు యాంకర్లను తప్పించినట్టు సమాచారం.