Home తాజా వార్తలు తెలంగాణ భవన్‌లో ఘనంగా స్వాతంత్య్ర దిన వేడుకలు

తెలంగాణ భవన్‌లో ఘనంగా స్వాతంత్య్ర దిన వేడుకలు

Nayaniహైదరాబాద్: 70వ స్వాతంత్య్ర దిన వేడుకలు తెలంగాణ భవన్‌లో ఘనంగా జరిగాయి. రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ ఎంతోమంది మహానీయుల త్యాగాల ఫలితమే స్వాతంత్య్రమన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితోనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఎన్నో ఉద్యమాలు చేసినట్లు చెప్పారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఎన్నో గొప్ప పథకాలను చేపట్టినట్లు తెలిపారు. వాటిలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం, కళ్యాణలక్ష్మీ, సాదీముబారక్, డబూల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం ముఖ్యమైనవిగా పేర్కొన్నారు. అంతేగాక అన్ని రంగాల అభివృద్ధిలోనూ రాష్ట్రం దూసుపోతుందన్నారు. దేశంలోనే నెం.1 సిఎం అయిన కెసిఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం గర్వకారణమన్నారు.ఈ కార్యక్రమంలో నాయినితోపాటు ఉప ముఖ్యమంత్రి మొహముద్ అలీ కూడా పాల్గొన్నారు.