Search
Wednesday 14 November 2018
  • :
  • :

ఇండిపెండెన్స్ డే కానుకగా అభిమానుల కోసం…

ntrసక్సెస్‌ఫుల్ మూవీ ‘టెంపర్’ తర్వాత ఫుల్ జోష్ మీదున్న ఎన్టీఆర్ తన తదుపరి సినిమా షూటింగ్‌ని శరవేగంగా పూర్తిచేస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లండన్‌లో జరుగుతోంది. సినిమా షూటింగ్ మొదలుపెట్టిన రోజే ఎన్టీఆర్ మోస్ట్ స్టైలిష్ లుక్‌కి సంబంధించిన కొన్ని ఫొటోలను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ ట్రై చేసిన న్యూ లుక్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులను కూడా మెప్పించింది.

తాజా సమా చారం ప్రకారం ఎన్టీఆర్ ఇండిపెండెన్స్ డే కానుకగా అభిమానులకు ఓ గిఫ్ట్ ప్లాన్ చేశాడు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎన్టీఆర్… సుకుమార్ సినిమాలోని ఓ స్టైలిష్ లుక్‌ను విడుదల చేయనున్నాడని తెలిసింది. రకుల్‌ప్రీత్‌సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు ‘నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్‌ను పరిశీలి స్తున్నారు. సెప్టెంబర్ దాకా లండన్‌లోనే షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాకు బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Comments

comments