Home బిజినెస్ సెన్సెక్స్ @ 38,000

సెన్సెక్స్ @ 38,000

Indexes started to stimulate buying in banking shares

న్యూఢిల్లీ: బుల్ దూకుడు ఆగట్లేడు. స్టాక్‌మార్కెట్లు సరికొత్త శిఖరాలను చేరుకుంటున్నాయి. పాత రికార్డులను బద్దలుకొడుతూ రోజు రోజుకీ కొత్త రికార్డులను సొంతం చేసుకున్నాయి. బ్యాంకింగ్, మెటల్ షేర్ల అండతో గురువారం ట్రేడింగ్‌లో దేశీ య మార్కెట్లు మరోసారి చరిత్ర సృష్టించాయి. మార్కెట్ చరిత్రలో తొలిసారిగా సెన్సెక్స్ 38వేల మార్క్‌ను దాటగా, నిఫ్టీ సరికొత్త జీవనకాల గరిష్ఠస్థాయిని చేరింది. సెన్సెక్స్ 137 పాయింట్ల లాభప డి 38,024 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 21 పాయింట్లు లాభపడి 11,470 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ తొలిసారి 38,000 పాయింట్లను క్రాస్ చేసి 38,076 పాయింట్లతో జీవితకాల గరిష్ఠానికి చేరుకుంది. నిఫ్టీ బ్యాంకింగ్, మెటల్, ఫైనాన్స్ రంగాలకు చెందిన సూచీలు లాభపడ్డాయి. ఇక ఫార్మా, అటో, ఐటీ రంగ సూచీలు నష్టాల్లో ముగిశాయి.

బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో సూచీలు ఉత్సాహంగా ప్రారంభించాయి. ఎన్‌ఎస్‌ఇలో కీలకమైన బ్యాంకు నిఫ్టీ 257 పాయింట్లు లాభపడి తొలిసారిగా 28,363 వద్ద ముగిసింది. శుక్రవారం వెల్లడించనున్న ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) జూన్ త్రైమాసిక ఫలితాలపై ఇన్వెస్టర్లు ఆశాజనకంగా ఉన్నారు.ఎన్‌ఎస్‌ఇ లో యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్‌బిఐ, హిందాల్కో, వేదాంతా షేర్లు లాభపడ్డాయి. ఎయిర్‌టెల్, టైటాన్, ఒఎన్‌జిసి, సిప్లా, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు నష్టపోయాయి. ట్రేడ్ వార్ కారణంగా ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి కనిపించింది. అయితే దేశీ మార్కెట్లు మాత్రం సానుకూలంగానే ముందుకు సాగాయి. దీంతో మరోసారి మార్కెట్లు జీవితకాల గరిష్టస్థాయిని నమోదు చేశాయి.

నిఫ్టీలో బ్యాంక్ షేర్ల జోష్
బ్యాంకింగ్ షేర్ల అండ తో సూచీలు పరుగులు తీశాయి. ప్రధానంగా ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు,ఎస్‌బిఐ బ్యాం కు షేర్లు బాగా రాణించాయి. ఐసిఐసిఐ బ్యాంకు ఓ దశలో 8.51 శాతం లాభపడి రూ.345.85ల వద్ద ఆరునెలల గరిష్టానికి చేరుకుంది. అయితే ఆఖరికి 4 శాతం లాభంతో రూ.332 వద్ద ముగిసింది. ప్రైవేటు సంస్థ యాక్సిస్ బ్యాంకు 4.20 శాతం లాభంతో 621 వద్ద ముగిసింది. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ 3శాతం లాభం తో రూ.317.65ల వద్ద స్థిరపడింది.

ఫార్మాలో నిరుత్సాహం
క్యూ1 ఫలితాలు ఆశించిన మేరకు లేకపోవడంతో ఫార్మా రంగ షేర్లు మాత్రం కొంత నిరుత్సాహంగా ముందుకు సాగుతున్నాయి. బ్యాంకింగ్, మెటల్ అండతో సూచీలు ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరుకున్నప్పటికీ ఫార్మా షేర్లు మాత్రం డీలాపడ్డాయి. వరసగా రెండో ట్రేడింగ్‌లో ఫార్మా షేర్లు నీరసించా యి. సిప్లా, అరబిందో ఫార్మా, దివీస్ ల్యాబ్స్ షేర్లు 2 శాతానికి పైగా నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఇలో ఫార్మా సూచీ అరశాతానికిపైగా నష్టపోయింది.