Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

భారత్ అదరహో…

India 69-Medals at 2018 asian games

మన తెలంగాణ/క్రీడా విభాగం: ఆసియా క్రీడల్లో భారత్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. ఆసియా క్రీడల చరిత్రలోనే భారత్ అత్యధికంగా 69 పతకాలు గెలిచి అరుదైన రికార్డును సృష్టించింది. కబడ్డీ, హాకీ, బ్యాడ్మింటన్ వంటి క్రీడల్లో నిరాశ ఎదురైనా అథ్లెటిక్స్‌లో ఆ లోటు తీరింది. ఇండోనేషియా వేదికగా జరిగిన క్రీడల్లో భారత్ ఏకంగా 15 స్వర్ణాలతో సహా 69 పతకాలు సాధించి సత్తా చాటింది. సగం రోజులు ముగిసే సమయానికి భారత్ సాధించిన స్వర్ణాల సంఖ్య ఆర డజను దాటలేదు. అయితే అథ్లెటిక్స్ ప్రారంభం కాగానే పరిస్థితి మారి పోయింది. భారత ఆటగాళ్లు అసాధారణ పోరాట పటిమతో పసిడి పతకాల పంట పండించారు. రెజ్లర్లు భజరంగ్ పునియా, వినేశ్ పొగట్, షూటర్లు సౌరభ్ చౌదరి, రాహి సర్నొబత్‌లు పసిడి పతకాలు గెలిచి సత్తా చాటారు. సౌరభ్ చౌదరి 16 ఏళ్ల వయసులోనే స్వర్ణం గెలిచి ఈ ఘనత సాధించిన అత్యంత చిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ఆసియా క్రీడల్లో అత్యంత చిన్న వయసులో స్వర్ణం సాధించిన ఘనత సౌరభ్‌కు దక్కుతోంది. మరోవైపు బ్రిడ్జ్ క్రీడల్లో ప్రణబ్ బర్దన్ 60 ఏళ్ల వయసులో స్వర్ణం సాధించి మరో అరుదైన ఘనతను సాధించాడు.

టెన్నిస్, సెపక్‌తక్రాలలో భారత ఆటగాళ్లు పతకాలు సాధించిన సరికొత్త ఆధ్యాయానికి తెర లేచారు. మరోవైపు మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో తెలుగుతేజాలు సైనా నెహ్వాల్, పి.వి.సింధులు పతకాలు గెలిచి ఈ ఘనత సాధించిన తొలి షట్లర్లుగా నిలిచారు. ఈసారి అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఏకంగా 19 పతకాలు లభించాయి. ఇందులో రికార్డు స్థాయిలో ఏడు స్వర్ణాలు ఉండడం మరో విశేషం. అంతేగాక మరో పది రజతాలు, రెండు కాంస్య పతకాలను కూడా భారత్ గెలుచుకుంది. షాట్‌పుట్ ఆటగాడు తజిందర్‌పాల్ సింగ్ అథ్లెటిక్స్‌లో స్వర్ణాల వేటకు శ్రీకారం చుట్టాడు. జావెలిన్‌త్రోలో భారత యువ సంచలనం నీరజ్ చోప్రా, పురుషుల 800 మీటర్ల పరుగులో మంజీత్ సింగ్, ట్రిపుల్ జంప్ విభాగంలో అర్పిందర్, పురుషుల 1500 మీటర్ల విభాగంలో జిన్సన్ జాన్సన్‌లు స్వర్ణాలు గెలిచే మువ్వెన్నల పతకాన్ని రెపరెపలాడించారు.

మహిళల విభాగంలో భారత్‌కు రెండు పసిడి పతకాలు లభించాయి. మహిళల హెప్టాథ్లాన్ విభాగంలో స్వప్న బర్మన్ పసిడి సాధించి చరిత్ర సృష్టించాడు. మరోవైపు మహిళల రిలేలో కూడా భారత్‌కు స్వర్ణం లభించాయి. బాక్సింగ్‌లో అమిత్ పంగల్ స్వర్ణం గెలిచి సత్తా చాటాడు. పురుషుల రోయింగ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో కూడా భారత్‌కు పసిడి పతకం దక్కింది. పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్నదివిజ్ శరన్ జోడీ స్వర్ణం గెలుచుకుంది. బ్రిడ్జ్ పెయిర్ విభాగంలో ప్రణబ్ బర్దన్‌సర్కార్ జంట పసిడి పతకం గెలుచుకుంది. ఈక్వెస్టియన్‌లో కూడా భారత్ రెండు రజతాలు గెలిచి ప్రకంపనలు సృష్టించింది. కాగా, ఈ క్రీడల్లో అథ్లెట్లు హిమదాస్, ద్యుతి చంద్, తజిందర్‌పాల్, స్వప్న, మహ్మద్ అనస్, సుధాసింగ్, నీనా తదితరులు పతకాలు సాధించి భారత ఖ్యాతిని ఇనుమండింప చేశారు.

స్వర్ణాలు
అథ్లెటిక్స్                     :     7 స్వర్ణాలు
షూటింగ్                    :      2 స్వర్ణాలు
రెజ్లింగ్                       :       2 స్వర్ణాలు
బ్రిడ్జ్                          :        స్వర్ణం
రోయింగ్                    :      స్వర్ణం
టెన్నిస్                      :     స్వర్ణం
బాక్సిం                       :    స్వర్ణం
రజతాలు
అథ్లెటిక్స్                   :     10 రజతాలు
షూటింగ్                    :     4 రజతాలు
ఆర్చరీ                        :     2 రజతాలు
ఈక్వెస్ట్రియన్                :        2 రజతాలు
స్కాష్                          :            రజతం
సెయిలింగ్                    :            రజతం
బ్యాడ్మింటన్                 :          రజతం
హాకీ                            :             రజతం
కబడ్డీ                          :               రజతం
కురాష్                       :                    రజతం
కాంస్యాలు
స్కాష్                          :         4 కాంస్యాలు
వుషు                         :             4 కాంస్యాలు
షూటింగ్                       :             3 కాంస్యాలు
అథ్లెటిక్స్                        :           2 కాంస్యాలు
టిటి                               :           2 కాంస్యాలు
బ్రిడ్జ్                              :           2 కాంస్యాలు
సెయిలింగ్                      :          2 కాంస్యాలు
టెన్నిస్                           :         2 కాంస్యాలు
రోయింగ్                         :          2 కాంస్యాలు
కబడ్డీ                             :            కాంస్యం
హాకీ                              :            కాంస్యం
కురాష్                          :             కాంస్యం
బ్యాడ్మింటన్                    :             కాంస్యం
సెపక్‌తక్రా                       :             కాంస్యం

Comments

comments