Home తాజా వార్తలు అజ్లాన్ షా హాకీ కప్‌లో భారత్‌కు కాంస్యం

అజ్లాన్ షా హాకీ కప్‌లో భారత్‌కు కాంస్యం

Indian-Hockey-Team

మలేషియా: సుల్తాన్ అజ్లాన్ షా హాకీ కప్‌లో మూడు, నాల్గు స్థానాల కోసం భారత్, న్యూజిలాండ్ మధ్య శనివారం సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 4-0 గోల్స్ తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. దీంతో భారత్ మూడో స్థానం నిలబడడంతో పాటు కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.

మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన భారత్‌కు రూపిందర్ పాల్ సింగ్ తొలి రెండు గోల్స్ అందించాడు. అనంతరం ఎస్‌వి సునీల్, తల్విందర్ సింగ్ చెరో గోల్స్ కొట్టడంతో భారత్ ఆధిక్యం 4-0కు చేరింది. ఇక న్యూజిలాండ్ ఏ దశలోనూ భారత్‌కు పోటీ ఇవ్వలేకపోయింది.