Search
Thursday 15 November 2018
  • :
  • :

ఆసీస్‌లో భారతీయ సంస్కృతిని విమర్శించిన రేపిస్టు

Cab-Driver1కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాలో ప్రవాస భారతీయుడు సిమర్‌దీప్ సింగ్ అనే క్యాబ్ డ్రైవర్ 18 ఏళ్ల బాలికను రేప్ చేశాడు. ఈ కేసులో సిమర్‌కు ఐదేళ్ల శిక్ష పడింది. భారతీయ సంస్కృతిపై విమర్శలు చేయడంతో పాటు సంస్కృతిని అడ్డంపెట్టుకొని కేసు నుంచి బయటపడేందుకు నిందితుడు ప్రయత్నం చేశాడు. పంజాబ్‌లో సంప్రదాయ కుటుంబంలో సింగ్ జన్మించాడు. భారత్‌లో పొట్టి దుస్తులు ధరించిన మహిళలను వ్యభిచారులుగా చూస్తారని, కుటుంబంలో, టివిలో కాని సెక్స్ గురించి మాట్లాడటం ఉండదన్నారు, భారత్‌లో సెక్స్ అనే పదం తప్పుగా భావిస్తారని ఆయన తరుపు లాయర్ కోర్టులో విన్నవించారు. ఆస్ట్రేలియా దేశంలోని చట్టాలను సింగ్ ఉల్లఘించారని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు.

Comments

comments