Home అంతర్జాతీయ వార్తలు ఫైనల్లో ఇండియా – ఇంగ్లాండ్…

ఫైనల్లో ఇండియా – ఇంగ్లాండ్…

 ICC World Cup 2019

 

వాషింగ్టన్: ఐసిసి వరల్డ్ కప్ 2019 ఫైనల్‌లో ఇండియా ఇంగ్లాండ్ తలపడతాయని గూగుల్ ఇండియన్ అమెరిక సిఇఓ సుందర్ పిచాయ్ అంచనా వేశారు. ఇండియా విజయం సాధించాలని కోరుకుంటున్నానన్నారు. ‘ఐసిసి ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్ ఇండియా మధ్య జరగాలి. అయితే మీకు తెలుసా? ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మంచి టీమ్‌లు’ అని పిచాయ్ వాషింగ్టన్ ప్రేక్షకులకు చెప్పారు. ఆయన ఈ అభిప్రాయం తెలిపేటప్పుడు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పోంపియో, ఇండియా, అమెరికాలకు చెందిన ఉన్నతస్థాయి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా ఉన్నారు. బుధవారం జరిగిన యుఎస్‌ఐబిసి ఇండియా ఐడియాస్ సమిట్ లో గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు అందుకున్న సందర్భంగా సుందర్ పిచాయ్ ఈ వ్యాఖ్య చేశారు.

India England in the ICC World Cup 2019 final