Home జాతీయ వార్తలు భారత్ కు చైనా షాక్…

భారత్ కు చైనా షాక్…

india-exports-to-china

న్యూఢిల్లీ: రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని స్థానిక కరెన్సీల్లోనే చేపడదామన్న భారత్ ప్రతిపాదనను చైనా తిరస్కరించింది. చైనాతో పెరిగిపోతున్న వాణిజ్య లోటును భర్తీ చేయాలన్న ఉద్దేశంతో భారత్ ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. ప్రస్తుతం చైనాకు ఇండియా ఎగుమతులు 1340 కోట్ల డాలర్లుగా ఉండగా.. దిగుమతులు మాత్రం 7640 కోట్లు డాలర్లుగా ఉంది. అంటే చైనాతో వాణిజ్య లోటు 6300 కోట్ల డాలర్లుగా ఉంది. ఇది 2016-17లో 5111 కోట్ల డాలర్లుగా ఉండేది. దీనిని అధిగమించేందుకు రెన్‌మిన్బీ-రూపీలలో వాణిజ్యం చేద్దామని ఇండియా ప్రతిపాదించింది. అయితే దీనికి చైనా అంగీకరించలేదని సీనియర్ అధికారి వెల్లడించారు. చైనాకు దేశ ఉత్పత్తులను మరింత ఎగుమతి చేయాలని భారత్ భావిస్తున్నది.

india-exports-to-china