Home ఎడిటోరియల్ ఓస్సి, ఇంకొకరు మరణించారు, అంతేనా!

ఓస్సి, ఇంకొకరు మరణించారు, అంతేనా!

Hospitalఆగ్రహం, ఆవేదన, నిరాశ, నిస్పృహ. నిర్లక్ష పూరితం, స్వార్థపూరితం, హృదయ రహిత మైన ఆరోగ్య వ్యవస్థ కారణంగా డెంగూ వ్యాధితో ఢిల్లీ నుంచి రాష్ట్ర రాజధాని వరకు రోజూ ఎక్కడోఅక్కడ ఎవరిదో ఒక ప్రాణం నులిమివేయబడుతున్నది. నేతలు పరస్పరం నిందారోపణలు చేసుకుంటూ ఉంటారు. ప్రజల ఆగ్రహం కేవలం డెంగూ మర ణాల పట్లనే కాదు; ప్రజారోగ్య వ్యవస్థను ఇంటెన్సి వ్‌కేర్ యూనిట్‌లో పెట్టి పాలకులు చెప్పే కల్లబొల్లి మాటలపట్ల కూడాః “భయపడాల్సిన పనిలేదు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. అంతా సర్దుకుం టుంది.” నిజమేనా? ఎంత దగా చేస్తున్నారు! రేడి యోలు, టివిలద్వారా ఇవి పాటించాలి, ఇవి చేయ కూడదు అని, నిర్దేశిత ఆసుపత్రులు, రోగ పరీక్ష కేంద్రాల జాబితాను చదవటం, నిరోధక చర్యలను ప్రకటించటం’ వల్ల అంటువ్యాధి పారిపోతుందని ఎవరూ ఆశించరు. అది నిర్దిష్ట చర్య కూడా కాదు. అది అధికార యంత్రాంగం ఆలస్యంగా చర్యలు చేబట్టటాన్ని, ప్రణాళికారహిత్యాన్ని, తప్పులతడక మేనేజిమెంట్‌ను క్షమించదు.
ఒక ప్రశ్న అడుగుదాం. ఆమ్ ఆద్మీ సంక్షేమం అంటే నిర్జీవమైన గణాంకాలేనా? ఒకవైపు ప్రమాణ రహితమైన, నిధులకొరత ఎదుర్కొంటున్న అవినీతి తోకూడిన ప్రజారోగ్య వ్యవస్థ. రెండోవైపున, అధిక జనాభా, దారుణమైన పారిశుద్ధ పరిస్థితి. దీనిగూర్చి ఏమి చెబుతారు?
పోలియోను పదేళ్లలో నిర్మూలించిన అద్భు తాన్ని సాధించిన ఆరోగ్య వ్యవస్థ గూర్చి, అదే సమ యంలో ప్రశూతి సమయంలో, సరళమైన కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ల సమయంలో స్త్రీలు మర ణించటం కొనసాగుతున్న అదే వ్యవస్థ గూర్చి ఏమి చెప్పాలి. మరో చిత్రమేమంటే, ప్రపంచం లోనే అత్యధికంగా మార్ఫిన్ (మత్తుమందు) ఉత్పత్తి చేసే దేశాల్లో మనదొకటి. అయితే దుర్భరమైన నొప్పి తో ఉన్న వ్యక్తికి దాన్ని సంపాదించటం తరచూ బహు కష్టమౌతోంది! మరో చిత్రం చూడండి: మన దేశం మెడికల్ టూరిజం కేంద్రంగా శీఘ్రంగా వృద్ధి చెందు తోంది. మంచి నాణ్యత, అందుబాటులో ఖర్చు ఉన్న వైద్యం కొరకు ఇతర దేశాలనుంచి రోగులు వస్తు న్నారు. మరోవైపున, ఈ సదుపాయాలు పౌరులకు లభ్యం కావు.
భారతదేశ విషాదమేమంటే, 68 సంవత్సరాల స్వాతంత్య్రం తదుపరి కూడా ప్రాథమిక ఆరోగ్య సేవలు ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రాలేదు. డెంగూనే తీసుకుంటే, అది వర్షరుతువులో ఏటా మృత్యునృత్యం చేస్తోంది. అది ప్రజ్వలిల్లకుండా చేయటానికి గత కొద్ది సంవత్సరాల్లో చేసిందేమీ లేదు. దాని నిరోధకానికి, అలాగే మలేరియా, చికెన్ గున్యా వంటి దోమకాటు సంబంధ వ్యాధుల నిరో ధానికి నిధుల కేటాయింపును ఆందోళనకరంగా తగ్గించారు. 2012లో రూ.50కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది దారుణంగా రూ.17 కోట్లకు కోత పెట్టింది. పర్యవసానంగా ఆరోగ్య డైరెక్టొరేట్ తన మొత్తం వ్యయంలో వీటికి కేటా యింపును 10నుంచి 5శాతం లోపునకు తగ్గించింది. వ్యాధిపై యుద్ధం క్షీణించటంలో ఆశ్చర్యమేమైనా ఉందా!
మలేరియా, క్షయ, కాలా అజార్, జపనీస్ ఎన్సిఫలిటివ్ వంటి సాధారణంగా నివారించదగిన ఇతర వ్యాధులకు సంబంధించీ ఇదే అవమానకర గాథ. ఇలాంటి మూడవ ప్రపంచ రోగాలతో గ్రామీణ భారత్ పోరాటం చేస్తుండగా, పెరుగుతున్న పట్టణీ కరణతో మధ్యతరగతులు, ఉన్నత తరగతులు రక్త పోటు, ఊబకాయం వంటి ‘అభివృద్ధిచెందిన ప్రపంచం’ జబ్బుల పాలవుతున్నారు. ఫాస్ట్‌ఫుడ్ సంస్కృతి, పెరుగుతున్న ధూమ, మద్య పానాలు ఊబకాయ సంబంధమైన రక్తపోటు, గుండె జబ్బుల పెరుగుదలకు దారితీస్తున్నాయి.
దిగ్భ్రాంతిగొలిపే విషయాలు – గ్రామీణుల్లో 50శాతానికి వైద్యసేవలు లభ్యం కావటం లేదు; 37శాతం ఆకలితో పోరాడుతున్నారు; 65శాతానికి మరుగుదొడ్లు లేవు; 50శాతం బహిర్భూమిలో మలవిసర్జన చేస్తున్నారు; 12.5 లక్షలమందికి పైగా బాలలు తొలి పుట్టినరోజుకు ముందే గిట్టుతున్నారు; సరైన పోషకాహారం లేనందున 48శాతంలో శాశ్వ తంగా ఎదుగుదల తగ్గుతోంది; కేవలం 7శాతం బాలలకే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశిత ప్రమాణాల ప్రకారం కనీస ఆమోదయోగ్య ఆహారం లభిస్తోంది. ఈ వ్యాధులను ఎదుర్కోవటానికి డాక్టర్లు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు!
మరీదారుణం – గత మూడు దశాబ్దాల్లో 1 కోటి 20లక్షల బాలికలకు గర్భస్రావం జరిగింది. 45శాతం యువతులకు 18ఏళ్లు రాకమునుపే వివా హాలు జరుగుతున్నాయి. ఇది పిన్నవయస్సులో గర్భ ధారణను, ఏదొక జబ్బుపాలుకావటం, ప్రసవ సమయ మరణాలు రేటు హెచ్చుగా ఉండటానికీ దారితీస్తున్నది. అంతేగాక, సాలీనా మూడుకోట్ల గర్భ ధారణల్లో దాదాపు 1,36,000మంది ప్రసవ సమ యంలో మరణిస్తున్నారు. 15-49మధ్య వయస్సు లో గర్భవతులైన పదిమందిలో తొమ్మిది మందిలో పౌష్టికాహారలోపం, రక్తహీనత శిశుమరణా ల్లో 20 శాతానికి కారణమవుతున్నాయి. ప్రతి పది నిముషా లకు ఒక తల్లి మరణం మహా బాధాకరం. అయినా వైద్యాధికారుల నిస్సహాయస్థితి కొనసాగు తోంది. కేంద్రప్రభుత్వం 2005 ఏప్రిల్‌లో 18రాష్ట్రా లపై ప్రత్యేకదృష్టితో దేశమంతటా జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) ప్రారంభించటం నిజం. అయినా మరణించేవారి సంఖ్య పెరుగు తోంది. 120కోట్లు జనాభాలో 24కోట్ల 30లక్షల మందికే ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాలు వర్తిస్తున్నాయి. మొత్తం 30కోట్లమందికి ఎటువంటి ఆరోగ్యబీమా లేదు.
ప్రజారోగ్యం ప్రభుత్వ ప్రాధాన్యతగా ఎన్నడూ లేదు. తొలి జాతీయ ఆరోగ్యవిధానం 1982-82లో మాత్రమే ప్రకటించబడింది. ఇది ఆరోగ్య సంరక్ష ణఫై ఏమూలకూ చాలని రీతిలో నిధుల కేటాయింపు నకు – జిడిపిలో ఒకశాతం లోపు – దారితీసింది.
గ్రామీణ ఆరోగ్య మౌలిక వసతులు- ఎన్‌ఎస్‌ఎస్‌ఒ అధ్యయనం ప్రకారం 20వేలకుపైగా జనాభా కలిగి న 28గ్రామాలకు ఒక డాక్టర్ మాత్రమే ఉన్నా రు. గ్రామాల్లో 54శాతం సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 5 కిలోమీటర్లకు పైబడిన దూరంలో ఉన్నాయి. 27శాతం 10కి.మీ.లకుపైగా దూరంలో ఉన్నాయి. పదిశాతానికి మాత్రమే డిస్పెన్సరీ, ఇరవై శాతానికి మాత్రమే ఒక ప్రైవేటు క్లినిక్ లేదా డాక్టర్ ఉన్నారు. ఆయన బయటకు వెళితే, ఇక అంతా దేవుడిదయ.
ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకారం, భారతదేశంలో ప్రతి లక్షమంది రోగులకు జాతీయ సగటున 45 మంది డాక్టర్లు, 8,9 పడకలు మాత్రమే ఉన్నాయి. అనేక పేద దేశాల స్థాయిలకన్నా ఇది తక్కువ! అంటు వ్యాధులు అదుపు చేయటానికి దేశం అవస్థ లు పడుతుంటే, అంటువ్యాధులు కాని జబ్బులు పెరుగుతున్నాయి. గుండెజబ్బులు, రక్తపోటు, క్యాన్సర్‌లు కలిపి భవిష్యత్‌లో దశాబ్దంలో 47శాతం పెరుగుతాయని భావించబడుతున్నది.
మన ఆరోగ్య వ్యవస్థలు భయంకరమైన స్థితిలో ఉండగా అంటువ్యాధులు ప్రబలమవుతున్నాయి. అయితే ఆరోగ్యం, సంక్షోభమేనేజిమెంట్ గూర్చి లేక శాశ్వత పరిష్కారాల గూర్చి అ,ఆలు నేర్చుకోవటానికి ఎవరూ సుముఖంగా లేరు. మనం ఇక్కడనుంచి ఎక్క డకు వెళ్లాలి? అది మన నేతలపై ఆధారపడి ఉంది. సామాజికరంగంలో సంస్కరణలు లేనటు వంటి ఆర్థిక సంస్కరణలు విషతుల్యమవు తాయని ప్రభు త్వం గుర్తించటానికి బహుశా ఇది సరైన సమయం.
వైద్యసేవను నిరంతరాయతతో అందించేందుకు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను జిల్లా ఆసుపత్రులతో సంధానించాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రుల్లో నిపుణులైన డాక్టర్లను లభ్యంచేయటం ద్వారా శిశు, మాతా వైద్యసేవలను పటిష్టం చేయాలి. నోడల్ ప్రభుత్వ ఆసుపత్రులను గుర్తించి, క్లిష్టసమ యంలో సేవలందించేందుకు ఎమర్జెన్సీ సేవలతో పాటు యంత్రపరికరాలు ఏర్పాటు చేయాలి. అదే సమయంలో గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో వైద్య, పారామెడికల్ కాలేజీల సంఖ్య పెంచాలి.
ప్రజారోగ్య మౌలికవసతుల కల్పనకు సంబం ధించి భారతప్రభుత్వం తన వ్యూహాలను, దృక్పథా లను పునరాలోచించవలసిన సమయం ఆసన్న మైంది. ప్రభుత్వం ఇంకెంతమాత్రమూ కళ్లు మూసు కోజాలదు. మంత్రుల సమావేశాలు, రాష్ట్రా లకు కేంద్రం ఆదేశాలవల్ల పని జరగదు. మన నాయ కులు మనిషి ప్రాణాన్ని గౌరవించటం నేర్చుకోవాలి. ఫరవాలేదు, ఇంకొకరు మరణించారు, అంతే, అనే నిర్లక్షపూరిత ధోరణిని విడనాడాలి.
(ఇన్ఫా)