Home తాజా వార్తలు భారత్‌కు పదో స్వర్ణం

భారత్‌కు పదో స్వర్ణం

India’s Medals Tally in Commonwealth Games 2018గోల్డ్‌కోస్ట్: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ హవా కొనసాగుతోంది. భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. తాజాగా భారత్ ఖాతాలోకి పదో స్వర్ణం వచ్చి చేరింది. మిక్సడ్ బ్యాడ్మింటన్ జోడితో పాటు టేబుల్ టెన్నీస్ పురుషుల జట్టు పసిడి పతకాలు కొల్లగొట్టాయి. ఫైనల్లో నైజీరియా జట్టుపై భారత టేబుల్ టెన్నీస్ జట్టు 3-0 తేడాతో ఘన విజయం సాధించగా, బ్యాడ్మింటన్ మిక్సడ్ ఫైనల్లో మలేషియా జట్టుపై భారత్ గెలిచి మరో స్వర్ణం గెలిచింది. సోమవారం ఒక్క రోజే ఇండియా మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంసపతాకాలు సాధించడం విశేషం. భారత్ ఖాతాలో ఇప్పటీ వరకు మొత్తం 19 పతాలు(10 స్వర్ణాలు, 4 రజతాలు, 5 కాంస్యాలు ) ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. భారత్ కంటే ముందు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.