Home స్కోర్ కామన్వెల్త్ రెజ్లింగ్‌లో భారత్‌కు స్వర్ణాల పంట

కామన్వెల్త్ రెజ్లింగ్‌లో భారత్‌కు స్వర్ణాల పంట

rjling

జోహెన్నస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో జరుగుతున్న కా మన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్ల ర్లు పతకాల పండించారు. శనివారం జరిగిన పు రుషుల విభాగం పోటీల్లో భారత రెజ్లర్లు పది స్వ ర్ణాలు, మరో 10 రజత పతకాలు గెలిచి సంచల నం సృష్టించారు. మహిళా విభాగం పోటీలు ఆదివారం జరుగుతాయి. 55 కిలోల విభాగంలో రా జేందర్ కుమార్, 60 కిలోల విభాగంలో మనీష్, 63 కిలోల విభాగంలో వికా, 67 కిలోల విభాగంలో అనిల్ కుమార్ స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. కాగా, 72 కేజీల అంశంలో ఆదిత్య కుం దు, 77 కిలోల విభాగంలో గుర్‌ప్రీత్, 87 కిలోల అంశంలో సునీల్, 97 కిలోల విభాగంలో హర్దీప్ పసిడి పతకాలు సాధించారు. అంతేగాక 130 కిలోల విభాగంలో భారత్‌కే చెందిన నవీన్ స్వర్ణ పతకం దక్కించుకున్నాడు. కాగా, భారత్ మొద టి రోజు మరో పది రజత పతకాలు కూడా లభించాయి. నవీన్, జ్ఞానేందర్, గౌరవ్ శర్మ, మనీష్, కుల్దీప్ మాలిక్, మంజీత్, అమర్‌నాథ్, ప్రభుపా ల్ సింగ్, సుమీత్, సోనులు రజత పతకాలు గెలుచుకున్నారు. తొలి రోజు జరిగిన పోటీల్లో భారత రెజ్లర్లు ప్రతిభతో క్లీన్‌స్వీప్ సాధించడం విశేషం.