Search
Thursday 18 October 2018
  • :
  • :

భారత్ వృద్ధి రేటు 7.3 శాతం

వచ్చే ఏడాది 7.4 శాతానికి
చైనా వృద్ధి రేటు అంచనాల్లో కోత
ఐఎంఎఫ్ వెల్లడి

India-Growth-rate

వాషింగ్టన్: భారత్ త్వరలోనే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధిస్తున్న దేశంగా మారనుందని ఐఎంఎఫ్(అంతర్జాతీయ ద్రవ్యనిధి) పేర్కొంది. మంగళవారం ఐఎంఎఫ్ వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్ నివేదికలో భారత్ గురించి వివరాలను వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (201819)గాను భారత్ 7.3 శాతం వృద్ధిరేటు, అలాగే 2019లో 7.4 శాతానికి వృద్ధిరేటు పెరిగే అవకాశం ఉందని నివేదికలో పేర్కొంది. వృద్ధి రేటులో 0.7 శాతానికి పైగా పాయింట్లతో చైనాను అధిగమించింది. భారత్ 2017లో 6.7శాతం వృద్ధిరేటును సాధించిన విషయం తెలిసిందే. ఇటీవల భారత్‌లో చేపట్టిన సంస్కరణలు వృద్ధికి దోహదం చేస్తున్నాయని సంస్థ పేర్కొంది. జిఎస్‌టి (వస్తు సేవల పన్ను) అమలు, ద్రవ్యోల్బణం తగ్గింపు లక్ష్యంగా ప్రణాళిక, దివాలా చట్టం, విదేశీ పెట్టుబడుల సరళీకరణకు చర్యలు వంటి అంశాలను ఐఎంఎఫ్ వెల్లడించింది. పెరుగుతున్న ముడి చమురు ధరలు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఐఎంఎఫ్ 2018 ఏప్రిల్‌లో ఇచ్చిన వరల్ ఎకనమిక్ ఔట్‌లుక్ నివేదికతో పోలిస్తే 2019లో వృద్ధి రేటు అంచనాలను తగ్గించింది.

భారత్‌లో అమలవుతున్న ముఖ్యమైన సంస్కరణలను ఐఎంఎఫ్ నివేదికలో పేర్కొంది. తమ అంచనాలు నిజమైతే భారత్ త్వరలోనే తిరిగి ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచే అవకాశం ఉందని తెలిపింది. చైనాను 2018లో 0.7శాతం తేడాతో దాటిపోనుందని తెలిపింది. 2019లో మరో 1.2 శాతం వృద్ధిరేటు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. 2017లో చైనా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. భారత్ కంటే 0.2 శాతం ఎక్కువగా 6.9 శాతం వృద్ధిరేటు సాధించింది. కాగా ఈ ఏడాది చైనా వృద్ధి రేటు అంచనాలను ఐఎంఎఫ్ తగ్గించింది. చైనా 6.6 శాతం వృద్ధిరేటు మాత్ర మే సాధించే అవకాశం ఉందని, 2019లో వృద్ధి రేటు 6.2 శాతానికి పడిపోయే అవకాశం ఉందని నివేదికలో పేర్కొంది. అమెరికా  చైనాపై విధిస్తున్న సుంకాల ప్రభావమూ ఆ దేశ వృద్ధిరేటుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది. భారత్‌లో ద్రవ్యోల్బణం పెరిగనుందని ఐఎంఎప్ తెలిపింది. 2018 19 సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనా 4.7 శాతంగా ఉండనుందని పేర్కొంది. అంతకుముందు 201718లో ద్రవ్యోల్బణం అంచనా 3.6 శాతం ఈసారి పెంచింది.

18కోట్ల మహిళా ఉద్యోగులకు ముప్పు

ఆటోమేషన్ వంటి నూతన సాంకేతికతలవల్ల ప్రపంపవ్యాప్తంగా 18 కోట్ల మంది మహిళా ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదముందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) హెచ్చరించింది. మహిళల్లో వృత్తి నైపుణ్యం కలవారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, పై స్థాయి పదవుల్లో నియామకాలకు లింగవివక్ష పాటించకూడదని, డిజిటల్ టెక్నాలజీ వల్ల వచ్చిన అంతరాన్ని తొలగించి కార్మికులకు ఆత్మవిశ్వాసాన్ని కల్పించాలని ఈ అంతర్జాతీయ ఆర్థిక సంస్థ ప్రపంచ నాయకత్వానికి విజ్ఞప్తి చేసింది. బాలీలో జరుగుతున్న అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ బ్యాంక్ వార్షిక సమావేశాల సందర్భంగా ఐఎంఎఫ్ ఒక విజ్ఞాపన పత్రాన్ని విడుదల చేసింది. 30 దేశాల్లో జరిపిన సర్వేలు అందించిన సమాచారం ప్రకారం కోట్ల సంఖ్యలో మహిళలు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదమున్నట్టు తెలిసింది. ఈ 30 దేశాల్లో 28 దేశాలు ఆర్థిక సహకారం, అభివృద్ధి వ్యవస్థలో ఉన్నాయి. మరో రెండు దేశాలు సైప్రస్, సింగపూర్. కొత్త టెక్నాలజీల వల్ల మహిళా ఉద్యోగులకు డిమాం డ్ తగ్గడమే కాక, వారి వేతనాలు కూడా తగ్గుతాయి. ప్రస్తుతమున్న సాంకేతిక పరిజ్ఞానం కారణంగా 30 దేశాల్లో 10 శాతం మంది అంటే 5.4 కోట్లమంది మగ, ఆడ శ్రామికులు ఉద్యోగం కోల్పోవచ్చని ఐఎంఎఫ్ నివేదిక పేర్కొంది. అలాగే రాబో యే రెండు దశాబ్దాల్లో 70 శాతం పరిశ్రమల్లో ఆటోమేషన్ వస్తుందని, ఇందువల్ల పురుషులకన్నా మ హిళా ఉద్యోగులే ఉపాధి కో ల్పోయే ప్రమాదం ఉంద ని కూడా ఆ సర్వేలో
తెలిసింది.

 India Growth Rate is 7.3%

Telangana news

Comments

comments