Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

భారత్ దరఖాస్తులు 3,06,601

green-cards

వాషింగ్టన్: అమెరికాలో గ్రీన్‌కార్డుల కోసం దరఖాస్తుల జాబితాలో భారతీయుల సంఖ్యనే అత్యధికంగా ఉంది. అమెరికాలో శాశ్వత నివాస హోదాకు హక్కు కల్పించే గ్రీన్‌కార్డులకు మొత్తం 3,95,025 మంది విదేశీ జాతీయులు దరఖాస్తు చేసుకున్నారు. ఇది 2018 మే నెల నాటి లెక్క. అయితే ఇందులో నాలుగింట మూడొంతుల మందితో భారతీయుల సంఖ్యనే అత్యధికంగా ఉందని తాజాగా వెలువడ్డ అధికారిక గణాంకాలతో వెల్లడైంది. ఏళ్ల తరబడి అమెరికాలో వివిధ వృత్తులలో ఉన్న భారతీయులు ఎంతో కాలంగా తమకు గ్రీన్‌కార్డు దక్కుతుందని ఆశిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో ట్రంప్ అధికార యంత్రాంగం కటుతర నిబంధనలతో వారి ఆకాంక్షలు ఫలించడం లేదు. ఉద్యోగాలో ఉన్న తమకు ప్రాధాన్యతాక్రమంలో గ్రీన్‌కార్డులు అందించాలని విదేశాల వారు కోరుతున్నారు. మొత్తం గ్రీన్‌కార్డు దరఖాస్తుదార్లలో భారతీయుల సంఖ్య 3,06,601 వరకూ ఉందని అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‌సిఐఎస్) గణాంకాలతో వెల్లడైంది. ఇండియా తరువాతి స్థానంలో చైనా ఉంది. 67,031 మంది చీనియులు గ్రీన్‌కార్డు కోసం వేచి ఉన్నారు. తరువాతి క్రమంలో ఎల్‌సాల్వెడార్ (7252), గౌటిమాలా (6027), హండూరస్ (5402), ఫిలిప్పీన్స్ ( 1491)చ వియత్నాం ( 521) దేశాల వారు ఉన్నారు. ఇక భారతీయులకు ఇప్పుడు వచ్చి పడే చిక్కు ఒకటి ఉంది. ప్రస్తుతమున్న చట్టపరమైన నిబంధనల పరిధిలో మొత్తం గ్రీన్‌కార్డుల కోటాలో ఏ ఒక్క దేశానికి ఏడు శాతం మించి కార్డులు ఏ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఇవ్వరాదు. ఈ విధంగా ఏళ్ల తరబడి గ్రీన్‌కార్డుల దరఖాస్తుదార్ల జాబితాలో భారతీయుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇండియన్ అమెరికను అత్యంత ప్రతిభావంతులు, విద్యాధికులుగా ఉన్నారు.భారత్ నుంచి సమున్నత ఉపాధి ఉద్యోగావకావాలను అన్వేషించుకుంటూ వీరిలో అత్యధికులు ఎక్కువగా హెచ్ 1బి వీసాలపైనే ఈ అగ్రదేశంలోకి వేల ఆశలతో వచ్చి చేరారు.

Comments

comments