Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

కిడ్నాపుల్లో భారత్‌కు రెండో స్థానం

kidnapన్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా కిడ్నా పులు అధికంగా జరుగుతున్న దేశా లలో భారత్ రెండవ స్థానాన్ని ఆక్ర మించింది. కిడ్నాపుల్లో మెక్సికో దే శం ప్రపపంచంలో మొదటి స్థానం లో నిలిచింది. యుకెకు చెదిన కన్స ల్టెన్సీ కంట్రోల్‌రిస్క్ అంతర్జాతీయ స్థాయిలో జరిగిన అపహరణల పరి స్థితిపై విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. భారత్ పొరు గుదేశం పాకిస్తాన్ మూడవ ర్యాంక్‌లో నిలవగా, ఆప్ఘనిస్తాన్ జాబితాలో ఏడవ ర్యాంక్‌లో ఉంచిన నివేదిక తెలిపింది. పొరుగుదేశాలైన పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ దేశాలతో పోలిస్తే భారత్‌లో అపహరణలు పెరిగిపోతున్నాయని నివేదిక వెల్లడిం చడానికి కారణం ఫిర్యాదుల సంఖ్య ఎక్కువగా రావడమే. అయితే, భారత్‌లో కిడ్నాపులు వ్యవస్థీకృత వ్యాపా రంగా లేదని తెలిపింది. దేశంలోని ఈశాన్య ప్రాంతంలో కిడ్నాపుల తరచూ జరు గుతున్నాయని తెలియజేసింది. కిడ్నాపులు జరిగి హత్యకుగురైనట్లు సృష్టించడం ద్వారా బీమా పాలసీల మొత్తాన్ని భారత్ లో క్లయిమ్ చేస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయని నివేదిక వెల్లడించింది. చాలా సందర్భాలలో కిడాపర్లు అధికారులనే కాకుండా వారి కుటుంబ సభ్యు లు, ఉద్యోగులను కూడా లక్షం గా చేసుకుంటున్నారని ఫ్యూచర్ జనరల్ ఇండి యా మేనేజింగ్ డైరెక్టర్, సిఇఓ కెజి.కృష్ణమూర్తి రావు చెప్పారు. చాలామంది ప్రజలు కిడ్నాపుల పేరుతో క్లయిమ్‌లు చేసుకుంటున్నారని రావు తెలిపారు.

Comments

comments