Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

భారత్‌కే ఛాన్స్: గంగూలీ

ganguly

న్యూఢిల్లీ: రానున్న ఇంగ్లండ్ పర్యటనలో భారత్‌కే గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జోస్యం చెప్పాడు. ఇంగ్లండ్‌తో పోల్చితే భారత్ చాలా బలంగా ఉండడమే దీనికి కారణమన్నాడు. గతంతో పోల్చితే ఈసారి భారత్ చాలా పటిష్టంగా ఉందన్నాడు. మూడు ఫార్మాట్‌లలో కూడా ఇంగ్లండ్ కంటే భారత్  బలంగా మారిందన్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి భారత్ ఈ సిరీస్‌లో ప్రకంపనలు సృష్టించడం ఖాయమన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విరాట్ సేన చాలా పటిష్టంగా తయారైందన్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ను ఓడించడం కష్టం కాదన్నాడు. గతంలో పరిస్థితులు వేరే విధంగా ఉండేవని, ఇప్పుడూ భారత్‌లో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యిందన్నాడు. ఎలాంటి జట్టునైన ఓడించే సత్తా భారత్‌కు ఉందన్నాడు. కొంత కాలంగా భారత్ నిలకడైన విజయాలు సాధిస్తున్న విషయాన్ని గంగూలీ గుర్తు చేశాడు. స్వదేశంలో, విదేశాల్లో భారత్‌కు ఎదురు లేకుండా పోయిందన్నాడు. దీనికి దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ సాధించిన విజయాలే నిదర్శనమన్నాడు. గతంలో ఇంగ్లండ్ గడ్డపై ఎదురైన ఘోర పరాజయానికి బదులు తీర్చుకునే ఛాన్స్ భారత్‌కు ఏర్పడిందన్నాడు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించాడు. విజయ్, ధావన్, పుజారా, కోహ్లి, రహానె తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉందన్నాడు. ఇషాంత్, భువనేశ్వర్, షమి, ఉమేశ్ తదితరులతో బౌలింగ్ కూడా పటిష్టంగా కనిపిస్తుందన్నాడు. ఇంగ్లండ్ గడ్డపై భారత బౌలర్లకు ఎదురు ఉండక పోవచ్చన్నాడు.

Comments

comments