Home తాజా వార్తలు ప్రపంచకప్‌ గెలిచే సత్తా టీమిండియాకు ఉంది: మిథాలీ

ప్రపంచకప్‌ గెలిచే సత్తా టీమిండియాకు ఉంది: మిథాలీ

Mithali-Rajన్యూఢిల్లీ: ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌ను గెలిచే సత్తా ఉన్న ఆటగాళ్లు టీమిండియాలో ఉన్నారని భారత మహిళ జట్టు వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ అన్నారు. ఎమ్ ఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, శిఖర్ ధవన్, రోహిత్ శర్మ ఇలా అనుభవం ఉన్న ప్లేయర్లు జట్టులో ఉన్నారు కాబట్టి, ఈసారి భారత జట్టు వరల్డ్ కప్ ను కైవసం చేసుకొనే చాన్స్ ఉందని మిథాలీ అభిప్రాయపడ్డారు. విరాట్ కోహ్లీ నేతృత్వంలో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరుస్తోందన్నారు. భారత్ కు ధవన్, రోహిత్ వంటి ఓపెనర్లు… బమ్రా ఇంకా స్పిన్నర్లతో బౌలింగ్ లైన్‌ఆప్ కూడా ఉందని ఆమె పేర్కొన్నారు.
తన దృష్టిలో ఏ టీమ్ అయితే  ఏక్కువ పరుగులు సాధిస్తుందో.. ఆ పరుగులను కట్టడి చేసే బౌలర్లు జట్టులో ఉంటారో వాళ్లే గెలుస్తారని ఆమె పేర్కొన్నారు. టీమిండియా జట్టులో అలాంటి ఆటగాళ్లే ఉన్నారు. ధోనీ అనుభవం కూడా భారత ఆటగాళ్లకు తోడుగా ఉంది. దీంతో మనకు ప్రపంచకప్ గెలిచే చాన్స్ ఎక్కువగా ఉన్నాయని మిథాలీ చెప్పుకొచ్చారు. అయితే, భారత జట్టు మాత్రమే కాకుండా.. ప్రపంచకప్‌కి ఆతిథ్యం ఇస్తున్న ఇంగ్లండ్ కూడా పటిష్టంగా ఉందన్నారు.
తాను ఇంగ్లండ్‌ను పక్కన పెట్టడం లేదు, వాళ్లు చాలా పటిష్టంగా ఉన్నారని మిథాలీ రాజ్ తెలిపారు. 10 నుంచి 15 వన్డేల్లో ఇంగ్లాండ్ జట్టు వరుసగా విజయాలు సాధించింది. వాళ్ల సొంత మైదానాల్లో పరిస్థితులు వాళ్లకే అనుకూలంగా ఉంటాయన్న ఆమె… ఇండియన్‌గా నేను టీమిండియాకే మద్దతు ఇస్తానని ఆమె పేర్కొన్నారు.
India have World Cup Winners Says Mithali Raj