Home అంతర్జాతీయ వార్తలు లండన్ హౌస్ స్వాధీనం

లండన్ హౌస్ స్వాధీనం

1920 దశకంలో బాబా సాహెబ్ అంబేడ్కర్ నివసించిన ఇల్లు త్వరలోనే మ్యూజియంగా ఏర్పాటు
AMBEDKARలండన్ : లండన్‌లోని అంబేడ్కర్ హౌస్‌ను భారత్ సొంతం చేసుకుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విద్యార్థిగా ఉన్నప్పు డు 1920వ దశకంలో లండన్‌లోని మూడంతస్తుల ఇంటిలో నివసించా రు. దీనిని 3.1 మిలియన్ పౌండ్లు చెల్లించి భారత్ దక్కించుకుంది. త్వరలోనే ఈ ఇంటిని అంబేడ్కర్ స్మారకంగా మార్చనున్నారు. లండన్‌లో ని భారత హై కమిషన్ ద్వారా మహారాష్ట్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రాజ్‌కుమార్ బడోలె సెప్టెంబర్ 24న కొనుగోలు చేయడం పట్ల ఫెడ రేషన్ ఆఫ్ అంబేడ్కరైట్ అండ్ బుద్ధిస్ట్ ఆర్జనైజేషన్స్ (ఎఫ్‌ఎబిఒ) అధ్యక్షుడు సంతోష్ దాస్ హర్షం వ్యక్తం చేశారు. ఈశాన్య లండన్‌లోని 10 కింగ్ హెన్రీ రోడ్డులో 2,050 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఇల్లు ఉంది. ప్రస్తుతం ఈ ఇంటికి అవసరమైన మరమ్మతులు చేసి అనంతరం అంబేడ్కర్ స్మారకంగా మార్చనున్నారు. గత ఏడాది ఒక ఎస్టేట్ ఏజెంట్ ద్వారా ఈ ఇంటి కొనుగోలును మహారాష్ట్ర సర్కార్ చేపట్టింది. ‘లండన్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంబేడ్కర్ అభిమానులకు ఇదో మరపు రాని రోజు. ఇదే ఇంటిలో అంబేడ్కర్ విద్యలో ప్రావీణ్యుడు కావడంతో పాటు భారత్‌లో బ్రిటిషన్ పాలన, కుల వ్యవస్థ ప్రభావం వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆయన సంసిద్ధులయ్యారు’ అని దాస్ తెలిపారు. సా మాజిక న్యాయం, మానహక్కులు, సమభావన వంటి అంశాలపై అంబే డ్కర్ పోషించిన పాత్ర గురించి ఆసక్తి ఉన్న లండన్‌లోని భారత సంతతి వారు, విజిటర్లు త్వరలోనే అంబేద్కర్ హౌస్‌ను సందర్శించుకోవచ్చని ఆయన చెప్పారు. విలియం విల్బెర్‌ఫోర్స్, డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ తో పోల్చదగిన ప్రముఖుడు డాక్టర్ అంబేద్కర్ అని ఆయన ప్రశంసిం చారు. అంబేద్కర్ హౌస్‌ను విజిటర్ల సందర్శనకు ఉంచే ముందు చాలా పనులు చేయాల్సి ఉందని, 2016లో బాబాసాహెబ్ 125వ పుట్టినరోజు నాటికి దీన్ని సిద్ధం చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుందని దాస్ అన్నారు. 65వ పడిలో 1956లో అంబేడ్కర్ కన్నుమూశారు. ఆయన మరణాంతరం 1990లో భారత ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పౌర అవార్డు భారతరత్న ప్రకటించింది.