Home రాష్ట్ర వార్తలు ఐటిలో భారత్‌దే ఆధిపత్యం

ఐటిలో భారత్‌దే ఆధిపత్యం

22నైపుణ్యాలు పెంచుకోవడం ద్వారా  భారత్ ఐటి రంగాన్ని శాసిస్తుంది  టి-హబ్‌తో కలిసి పని చేస్తాం  స్టార్టప్‌లు, యాక్సిలేటర్ల అభివృద్ధిలో   భాగస్వాములమవుతాం సత్య నాదెళ్ల స్పష్టీకరణ  హబ్‌ను సందర్శించిన మైక్రోసాఫ్ట్ సిఇఒ స్వాగతం పలికిన మంత్రి కెటిఆర్

టి హబ్‌తో కలిసి పనిచేస్తాం   మైక్రోసాప్ట్ సిఇఒ సత్య నాదెళ్ల
హైదరాబాద్ : ఐటి రంగంలో భారతీయుల ఆధిపత్యం క్రమంగా పెరుగుతూ వస్తోందని మైక్రోసాప్ట్ సిఇఒ సత్య నాదెళ్ల అభి ప్రాయపడ్డారు. వృత్తి నైపుణ్యాలు క్రమంగా మెరు గుపర్చుకోవడం ద్వారా రానున్న రోజుల్లో ఐటి రంగాన్ని శాసించే స్థాయికి చేరుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని టి హబ్‌ను ఆయన సోమవారం ఉదయం సందర్శించారు. రాష్ట్ర ఐటి మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టి హబ్ భవనం అంతా కలియతిరిగారు. ఈ సందర్భం గా టి హబ్ ఏర్పాటు విశిష్టత, ఆవశ్యకతను ఆయన సత్య నాదెళ్లకు వివరించారు. అనంతరం టి హబ్‌లోని స్టార్టప్ ప్రతినిధులతోనూ సత్య నాదెళ్ల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ రానున్న రోజుల్లో టి హబ్‌తో మైక్రోసాప్ట్ కలిసి పని చేస్తుందని ప్రకటించారు. భారత్‌లో స్టార్టప్‌లు, యాక్సిలేటర్ల అభివృద్ధిలో భాగస్వా ములవుతామన్నారు. స్టార్టప్ సంస్థల అభివృద్ధిలో సంస్కృతి, సామర్థం చాలా కీలక భూమికనే పోషిస్తాయన్నారు. యువ వ్యాపారవేత్తలను మరింత ఉన్నత స్థానాలకు తీసుకువెళ్లడమే తమ లక్షమన్నారు. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకున్నప్పుడే విజయాలు వరిస్తాయని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ సందర్భంగా స్టార్టప్‌ల కోసం ఏర్పాటుచేసిన టి హబ్ విశిష్టత, ఏర్పాట్లను కెటిఆర్ సత్య నాదెళ్లకు వివరించారు. అనంతరం జరిగిన సమావేశంలో స్టార్టప్ కంపె నీల ఏర్పాటుపై చర్చించారు.  నిజానికి ఇదే రోజున ప్రభుత్వం ఐటి పాలసీని కూడా ప్రకటించాలని భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, టి హబ్ సిఒఒ శ్రీనివాస్ కొలిపెరా తది తరులు పాల్గొన్నారు.