Home తాజా వార్తలు సమరోత్సాహంతో టీమిండియా

సమరోత్సాహంతో టీమిండియా

 World Cup 2019

నేడు కివీస్‌తో వామప్ పోరు
లండన్: ప్రపంచకప్‌కు ముందు జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌కు భారత్ సిద్ధమైంది. శనివారం భారత్ తొలి వామప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ప్రపంచకప్ ఫేవరెట్లలో ఒకటిగా పరిగణిస్తున్న టీమిండియా ఈ మ్యాచ్ ద్వారా తన లోపాలపై దృష్టి సారించాలని భావిస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ కూడా ఇదే లక్షంతో ఉంది. రెండు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. ఇటీవల ముగిసిన ఐపిఎల్‌లో ఇటు భారత్, అటు న్యూజిలాండ్ క్రికెటర్లు ముమ్మర క్రికెట్‌ను ఆడారు. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లకు కావాల్సినంత ప్రాక్టీస్ లభించిందనే చెప్పాలి. ఐపిఎల్ ముగిసిన తర్వాత కాస్త విశ్రాంతి తీసుకున్న భారత ఆటగాళ్లు ప్రస్తుతం ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. కివీస్‌తో జరిగే మ్యాచ్‌ను సద్వినియోగం చేసుకోవాలని బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆటగాళ్ల ఫామ్‌ను పరీక్షించేందుకు ఈ మ్యాచ్ దోహదం పడుతుందని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ముఖ్యంగా ఐపిఎల్ సందర్భంగా గాయపడిన కేదర్ జాదవ్‌ను ఫిట్‌నెస్‌ను పరీక్షించేందుకు ఈ మ్యాచ్ ఉపయోగపడనుంది.

ఇందులో రాణించే ఆటగాళ్లకు ప్రపంచకప్ తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దీంతో ప్రతి ఆటగాడు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. కెప్టెన్ కోహ్లి, మాజీ సారథి ధోని, స్పీడ్‌స్టర్లు బుమ్రా, భువనేశ్వర్, షమి తదితరులు ఇప్పటికే ముమ్మర సాధన చేశారు. ఓపెనర్లు ధావన్, రోహిత్, రాహుల్‌లు కూడా నెట్స్‌లో చెమటోడ్చారు. ఆల్‌రౌండర్లు హార్దిక్, శంకర్‌లు కూడా వార్మప్ మ్యాచ్ కోసం సిద్ధమయ్యారు. కివీస్ ఆటగాళ్లు కూడా మ్యాచ్ కోసం ముమ్మర కసరత్తు చేశారు. ఇందులో గెలవడం ద్వారా ప్రపంచకప్‌కు సమరోత్సాహంతో సిద్ధం కావాలని కివీస్ భావిస్తోంది.

India is ready to warm up match For World Cup 2019