Search
Thursday 18 October 2018
  • :
  • :

విజేత ఆస్ట్రేలియా

India is runners-up in the Champions Trophy hockey tournament

చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ఓటమి

బ్రెడా: ప్రతిష్టాత్మకమైన చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో భారత్ పెనాల్టీ షూటౌట్‌లో ఓటమి పాలైంది. నెదర్లాండ్స్ వేదికగా జరిగిన ఈ చాంపియన్స్ ట్రోఫీలో భారత్ అద్భుత ప్రదర్శన కనబరిచినా ఫైన ల్లో ఆస్ట్రేలియాను దాటి ముందుకు వెళ్లలేక పోయింది. హా కీలో భారత్‌పై అద్భుత రికార్డును కలిగిన ఆస్ట్రేలియా ఈసా రి కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించి ట్రోఫీని ఎగురేసుకు పోయింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో భారత్ చివరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. నిర్ణీ త సమయంలో ఇరు జట్లు 11 గోల్స్‌తో సమంగా నిలిచా యి. ప్రథమార్దంలో ఆస్ట్రేలియా దూకుడును ప్రదర్శించిం ది. భారత్‌ను హడలెత్తిస్తూ ముందుకు సాగింది. ఇదే క్ర మంలో 24వ నిమిషంలో బ్లేక్ ఆస్ట్రేలియాకు తొలి గోల్‌ను అందించాడు. దీంతో మొదటి అర్ధ భాగంలో ఆస్ట్రేలియా 10 ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధంలో భారత్ దూకుడుగా ఆడింది. స్కోరును సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. 43వ నిమిషంలో భారత్ శ్రమ ఫలించిం ది. వివేక్ సాగర్ అద్భుత గోల్‌తో స్కోరును సమం చేశాడు. తర్వాత ఇరు జట్లు నిర్ణీత సమయంలో మరో గోల్ సాధించలేక పోయాయి. దీంతో పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితాన్ని తేల్చారు. ఇందులో ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చె లాయించి 31 ఆధిక్యాన్ని సాధించింది. ఆస్ట్రేలియా మూ డు గోల్స్ సాధించగా భారత్ ఒకటే చేసింది. దీంతో ఆస్ట్రేలియా 42తో మ్యాచ్‌ను సొంతం చేసుకుని చాంపియన్స్ ట్రోఫీని తన ఖాతాలో జమచేసుకుంది.

Comments

comments