Search
Friday 16 November 2018
  • :
  • :

అండర్సన్‌తోనే అసలు సమస్య

India is the real problem in the five-match Test series

ఆసీస్ మాజీ దిగ్గజం మెక్‌గ్రాత్

చెన్నై: ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్‌కు అసలు సమస్య స్పీడ్‌స్టర్ జేమ్స్ అండర్సన్‌తోనే పొంచి ఉందని ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ మెక్‌గ్రాత్ అభిప్రాయ పడ్డాడు. ఈ మ్యా చ్‌లో భారత్ గెలుపు ఓటములు అండర్సన్‌ను ఎదుర్కొవడంపైనే ఆ ధారపడి ఉన్నాయనడంలో సందేహం లేదన్నాడు. స్వింగ్‌కు సహకరించే ఇంగ్లండ్ పిచ్‌లపై అండర్సన్‌ను ఎదుర్కొని పరుగులు సాధించడం ఎంతటి బ్యాట్స్‌మెన్‌కైనా చాలా కష్టమన్నాడు. గతంలో ఇక్కడ పర్యటించిన విదేశి జట్లకు ఈ పరిస్థితి ఎదురైందన్నాడు. ఈసారి కూడా అండర్సన్ ఇంగ్లండ్‌కు ప్రధాన ఆయుధంగా ఉన్నాడన్నాడు. అతని బౌలింగ్ చాలా అద్భుతమన్నాడు. తాను చూసిన అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో అండర్సన్ చాలా కీలకమన్నాడు. ఎంతటి బలమైన బ్యాటింగ్ లైనప్‌నైనా చిన్నాభిన్నం చేసే సత్తా అండర్సన్‌కు ఉందన్నాడు. కాగా, సుదీర్ఘంగా సాగనున్న టెస్టు సిరీస్‌లో అండర్సన్ ఫిట్‌నెస్ కాపాడుకుంటాడా లేదా అనే సందేహాన్ని కూడా మెక్‌గ్రాత్ వ్యక్తం చేశాడు. ఒకవేళ అన్ని మ్యాచ్‌లు ఆడితే మాత్రం భారత్‌కు విజ యం అంత సులువుకాదని మెక్‌గ్రాత్ స్పష్టం చేశాడు. టెస్టుల్లో అండర్సన్ అద్భుతంగా రాణిస్తున్నాడని, మ్యాచ్ మ్యాచ్‌కు అతను మరింత రాటుదేలుతున్నాడని ప్రశంసించాడు. ఇంగ్లండ్‌ను ఓడించాలంటే భారత బ్యాట్స్‌మెన్ ముందు అండర్సన్‌ను ధైర్యంగా ఎదుర్కొవాలన్నాడు. అతన్ని తట్టుకుని నిలబడితే ఇంగ్లండ్‌పై గెలవడం కోహ్లి సే నకు కష్టమేమి కాదన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమా రు చేసే బ్యాట్స్‌మెన్‌లు భారత్‌కు అందుబాటులో ఉన్నారని, అయితే విదేశి పిచ్‌లపై తడబడే బలహీనత వారికుందన్నాడు. ఈ బలహీనతే భారత్‌కు విదేశాల్లో ప్రతికూలంగా మారుతుందన్నాడు. సొంత గడ్డపై భారత్ చాలా బలంగా ఉంటుందని, అదే విదేశి సిరీస్‌లకు వచ్చే సరికి బలహీనంగా మారుతుందన్నాడు. దీనికి ప్రధాన కారణం ఫాస్ట్ పిచ్‌లపై తడబడడమేనని మెక్‌గ్రాత్ అన్నాడు. కానీ, ఇటీవల కాలంలో భారత్ చాలా బలంగా మారిందన్నాడు. ఫాస్ట్ బౌలర్లను దీటుగా ఎదుర్కొనే అస్త్రాలు భారత్‌కు అందుబాటులో ఉన్నాయన్నాడు. మురళీ విజయ్, చటేశ్వర్ పుజారా, కోహ్లి, అజింక్య రహానె, లోకేష్ రాహుల్ తదితరులకు ఫాస్ట్ బౌలర్లను దీటుగా ఎదుర్కొనే సత్తా ఉందన్నాడు. దీంతో భారత్ అవకాశాలను కొట్టి పారేయలేమని మెక్‌గ్రాత్ అన్నాడు. కాగా, ఈ సిరీస్‌లో భారత బౌలింగ్ లైనప్ చాలా బలంగా ఉందన్నాడు. ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమిలతో కూడిన పటిష్టమైన ఫాస్ట్ బౌలింగ్ త్రయం భారత్‌కు అందుబాటులో ఉందని, వీరు రాణిస్తే ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌కు  ఇబ్బందలు ఖాయమన్నాడు. అంతేగాక అశ్విన్, జడేజా, కుల్దీప్‌ల రూపంలో ప్రపంచ స్థాయి స్పిన్నర్లు ఉండనే ఉన్నారన్నాడు. దీంతో ఇంగ్లండ్‌కు ఈసారి గట్టి పోటీ తప్పదని మెక్‌గ్రాత్ జోస్యం చెప్పాడు.

Comments

comments