Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

పోరాడిన భారత్.. రెండో వన్డేలో ఓటమి

IND-VS-NZన్యూఢిల్లీ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ చతికిలపడింది. తొలి వన్డేలో సునాయాస విజయం సాధించిన టీం ఇండియా రెండో వన్డే మాత్రం పరాజయాన్ని చవిచూసింది. న్యూజిలాండ్ నిర్ధేశించిన 243 పరుగుల టార్గెట్‌ని ఛేదించడంలో భారత ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ ఆటగాళ్లు 9 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత బ్యాట్స్‌మెన్లు మాత్రం వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఒపెనర్లు రోహిత్ (15), రహానే పరుగులు చేసి వెనుదిరిగారు. 2016లో ఫుల్ ఫామ్‌తో చెలరేగుతున్న డాషింగ్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 9 పరుగుల స్వల్ప స్కోర్ చేసి వెనుదిరిగాడు. కెప్టెన్ ధోని (39), కెదర్ జాదవ్(41)తో కలిసి జట్టుకను గెలిపించడానికి పోరాడిన ఫలితం లేకుండా పోయింది. 139 పరుగుల వద్ద జాదవ్ హెర్నీ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ధోని 172 పరుగుల వద్ద సౌతీ బౌలింగ్‌లో క్యాచౌట్‌గా పెవిలియన్ బాట పట్టాడు. బ్యాటింగ్ బరిలోకి దిగిన ఆటగాళ్లేవ్వరూ పెద్దగా రాణించలేదు. అ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన హార్థిక్ పాండ్యా జట్టుకు విజయం కోసం కృషి చేశాడు. కాని 36 పరుగులు చేసి క్యాచ్ ఔట్ రూపంలో వెనుదిరిగాడు. దీంతో న్యూజిలాండ్ భారత్‌పై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Comments

comments