Home జాతీయ వార్తలు అటల్ ఏం చెప్పినా, ఏం చేసినా దేశ హితం కోసమే…

అటల్ ఏం చెప్పినా, ఏం చేసినా దేశ హితం కోసమే…

India lost the pole star of its politics, says Amit Shah

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి నేరుగా వాజ్ పేయి నివాసానికి ఆయన పార్థివదేహం చేరుకుంది. వాజ్ పేయి పార్థివదేహాన్ని బిజిపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సందర్శించారు. తరువాత షా మీడియాతో మాట్లాడారు. భారత రాజకీయాల్లో ఓ ధృవతార రాలిపోయిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. సాహితీ శిఖరం నేలకొరిగిందని, గొప్ప జర్నలిస్టును కోల్పోయామన్నారు. చట్టసభల్లో పీడితుల పక్షాన పోరాటం చేసిన గొంతు మూగబోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వాజ్ పేయి మరణంతో కోట్లాది మంది యువకులు తమ ప్రేరణను కోల్పోయారని చెప్పారు. ఆయన లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిదని అన్నారు. జనసంఘ్, బిజెపి అభివృద్ధిలో వాజ్ పేయి ఎంతో కృషి చేశారని, తమకు ఆయన మార్గ నిర్దేశం చేశారని అమిత్ షా పేర్కొన్నారు. అటల్ ఏం చెప్పినా, ఏం చేసినా దేశ హితం కోసమే ఉండేదని షా కొనియాడారు.