Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

ఆదుకున్న కోహ్లి, రహానె

India lost three wickets trapped in trouble

భారత్ 307/6, ఇంగ్లండ్‌తో మూడో టెస్టు

నాటింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో శనివారం ప్రారంభమైన మూడో టెస్టులో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. ఒక దశలో 82 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న భారత్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ అజింక్య రహానెలు అసాధారణ బ్యాటింగ్‌తో ఆదుకున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఓపెనర్లు శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్‌లు మెరుగైన ఆరంభాన్ని ఇచ్చారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన ధావన్ ఏడు ఫోర్లతో 35 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించాడు. ఆ వెంటనే రాహుల్ (23), పుజారా (14) ఔటయ్యారు. దీంతో భారత్ కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో కోహ్లి, రహానెలు అద్భుత బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను పటిష్ట పరిచారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రహానె 12 ఫోర్లతో 81 పరుగులు చేసి ఔటయ్యాడు. కోహ్లి 11 ఫోర్లతో 97 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇదే సమయంలో మూడు పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ మూడు వికెట్లు తీశాడు. ఆట ముగిసే సమయానికి రిషబ్ పంత్ 22 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

Comments

comments