Home తాజా వార్తలు వాణిజ్య యుద్ధంతో భారత్ కు మేలే

వాణిజ్య యుద్ధంతో భారత్ కు మేలే

india manufacturing sector is slowly growing

వాణిజ్యం, తయారీ రంగాలకు దేశం నెలవవుతుంది : జైట్లీ

న్యూఢిల్లీ: ‘ప్రపంచ వాణిజ్య యుద్ధం ‘ఆదిలో అస్థిరత’ను సృష్టించొచ్చు, కానీ క్రమేణా అది భారత్‌కు మేలు చేస్తుంది. దేశం పెద్ద ఎత్తున వాణిజ్యం, తయారీ రంగాలకు నెలువుగా ఎదుగుతుంది’ అని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం చెప్పారు. వాణిజ్య సంస్థలు నైతిక ఆచరణలు పాటించాలన్నారు. తమవంతు పన్నులను సక్రమంగా చెల్లించాలన్నారు. మోసం చేసి రాత్రికిరాత్రి విదేశాలకు బిచాన ఎత్తేసేవారికి ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్ రప్టసీ కోడ్(దివాలా స్మృతి) తలుపులు మూసేస్తుందన్నారు. పిహెచ్‌డి చాంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన ఈ విషయాలు చెప్పారు. కొన్ని ప్రపంచ ప్రతికూలపవనాలు భారత్‌పై దుష్ప్రాభావం చూపగలవు, కానీ కాలక్రమేణ అవే దేశం వేగం గా అభివృద్ధి చెందేందుకు అనేక అవకాశాలు సృష్టిస్తాయన్నారు. ‘మనం ప్రపంచ వాణిజ్య యుద్ధాన్ని చాలా శ్రద్ధగా గమనించాలి..పరిస్థితి మన కు ఎప్పుడు అవకాశాలు కల్పిస్తుందో జాగ్రత్తగా చూడాలి’ అని జైట్లీ తన విడియో కాన్ఫరెన్స్‌లో చెప్పుకొచ్చారు. అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా అమెరి కా మార్కెట్లలో మెషినరీ, ఎలక్ట్రికల్ పరికరాలు, వాహనాలు, రవాణా విడిభాగాలు, రసాయనాలు, ప్లాస్టికు, రబ్బరు వంటి భారత ఉత్పత్తులు పోటీపడే అవకాశాన్ని కల్పిస్తాయని నిపుణులు అంటున్నారు. మన ఆర్థిక వ్యవస్థకు పెరుగుతున్న చమురు ధరలు కూడా సవాళ్లు విసురుతున్నట్లు జైట్లీ చెప్పారు. దేశ అవసారల కోసం భారత్ 81 శాతం చమురు దిగుమతులపై ఆధారపడుతోందన్నారు. ప్రపంచంలో భారత్ మూడో అతిపెద్ద చమురు దిగుమతి దేశంగా ఉంది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుండడం వల్ల దేశీయంగా ఇంధన ధరలు పెరగడానికి దోహదం అవుతోంది. ప్రపంచానికి సగం చమురును సరఫరా చేస్తున్న బ్రెంట్ మార్కెట్‌లో బ్యారెల్ ధర గత ఐదు వారాల్లో 71 అమెరికా డాలర్ల నుంచి 80 అమెరికా డాలర్లకు పెరిగింది. ‘ఈ సవాళ్లు ఎల్లకాలం ఉండవు. రాబోయే సంవత్సరాల్లో భారత్ అభివృద్ధి చెం దేందుకు పెద్ద అవకాశాలుంటాయని నేను నమ్ముతున్నాను’ అని జైట్లీ చెప్పారు.
వాణిజ్య సంస్థలు నైతికతలు పాటించాలని జైట్లీ కోరారు. ఐబిసి అనంతరం మోసాలకు పాల్పడి రాత్రికిరాత్రే చెక్కేసేవారికి తలుపులు మూసుకుంటాయ ని, కానీ నైతికతలు పాటించేవారి కి తమ వ్యాపారం కొనసాగించుకునే అవకాశాలుంటాయని అన్నారు. ‘స్వేచ్ఛావాణిజ్యాన్ని అనుమతించాక వాణిజ్యంలో నైతికతకు ప్రాముఖ్యతనిస్తామన్నారు. పన్నులు సక్రమంగా చెల్లించేవారిపై పన్నులు ఎగవేసేవారి భారం పడనివ్వబోమన్నారు. కనుక పన్ను ఎగవేస్తున్నవారిని పన్ను యంత్రాంగంలోకి తెచ్చి నైతికతలు పాటించేలా చేస్తాం’ అని జైట్లీ చెప్పారు. దివాలాస్మృతి(ఐబిసి) భారత వాణిజ్యంపై కొత్త నైతికతలను విధించిందని జైట్లీ అన్నారు.
‘రుణదాతల నుంచి ఎవరైనా రుణం తీసుకుని డబ్బు సంపాదించాక ఆ రుణం తీర్చేయాలి. అంతేకానీ రుణదాతలకు నిద్రలేని రాత్రులు సృష్టించకూడదు’అని చెప్పుకొచ్చారు. ‘నైతికంగా వ్యాపారవాణిజ్యాలు చేసుకునేవారికి మేటు జరిగే సంస్కృతిని మేము ప్రవేశపెట్టేందుకు యత్నిస్తున్నాం. భారత వాణిజ్య రంగంలో అలాంటి నైతిక ఆచరణలను ప్రోత్సహించనున్నాం’ అన్నారు.