Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ఆసియా టోర్నీలో భారత్ పాక్‌తో ఆడుతుందో లేదో?

women-teamన్యూఢిల్లీ: బ్యాంకాక్‌లో శనివారం ప్రారంభం కానున్న ఆసియా కప్ టోర్నమెంట్‌లో భారత్ మహిళల జట్టు  ఆడనున్నట్టు బిసిసిఐ ప్రకటిం చింది. అయితే ఈ టోర్నమెంట్‌లో భారత మహిళల జట్టు పాక్‌తో తలప డుతుందో? లేదో అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇటీవల ఇరు దేశాల సరిహద్దు ప్రాంతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ పరిణామాల నేప థ్యంలో ఇప్పుడు భారత్, పాక్‌ల మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆసియా కప్‌లో భారత్ జట్టు ఉత్తేజంతో పాల్గొంటుందని, పాక్‌తో భార త్ తలపడుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమంటూ బిసిసిఐ జా యింట్ సెక్రటరీ అమితాబ్ చౌదరి మీడియాకు వెల్లడించాడు. అయితే మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 29న థాయిలాండ్‌లో జరుగనున్న టోర్నమెంట్‌లో భారత్ పాక్‌తో తలపడాల్సి ఉంది. గతంలో ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 31 వరకు జరిగిన ఐసిసి వరల్డ్ చాంపియన్‌షిప్ మూడు మ్యాచ్‌లలో భారత జట్టు పాక్‌తో ఆడనందుకు భారత్‌పై ఆరు పాయింట్ల కోత పడిన సంగతి తెలిసిందే. మరోవైపు భారత్, పాక్ సరిహద్దులో తీవ్ర వాదం తలెత్తిన నేపథ్యంలో పాక్‌తో భారత్ ఆడటం సాధ్యమయ్యే పనికా దని అధ్యక్షుడు, రాజకీయవేత్త అనురాగ ఠాకూర్ అభిప్రాయపడ్డారు.  జట్లు ఆసియా కప్ టోర్నమెంట్‌లో తలపడడం చాలా సున్ని తమైన అంశగా పరిగణించాల్సి ఉందని ఆయన చెప్పారు. గత ఏడాది మార్చి-ఏప్రిల్ నెలలో జరిగిన వరల్డ్ టి20 మ్యాచ్‌లలో ఇరుదేశాల పురుషులు, మహిళల జట్లతో పాక్ ఆడిన సంగతి విధితమే. ఇదిలా ఉం డగా, ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ తమ వెబ్‌సై ట్‌లో ఆసియా కప్ టోర్న మెంట్‌కు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను పొందపరిచింది. టోర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం.. ఆసియా కప్‌లో మ్యాచ్‌లన్నీ బ్యాంకాక్‌లోని తెర్థా యి క్రికెట్ గ్రౌండ్‌లో జరుగునున్నాయి. ఈ టోర్నమెంట్‌లో భారత్ సహా (పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, థాయిలాండ్) ఆరు జట్లు పాల్గొంటున్నాయి.

Comments

comments