Home తాజా వార్తలు టీమిండియాకు పరీక్ష!

టీమిండియాకు పరీక్ష!

India-Pakistan marquee clash in focus ahead of Asia Cup

నేటి నుంచే ఆసియా కప్

దుబాయి: ఇంగ్లండ్‌తో జరిగిన సుదీర్ఘ సిరీస్‌లో ఘోర పరాజయం చవిచూసిన టీమిండియాకు దుబాయి వేదికగా జరిగే ఆసియా కప్ టోర్నీ సవాలుగా మారింది. ఈ టోర్నీలో భారత్‌కు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ రూపంలో గట్టి పోటీ నెలకొంది. అంతేగాక శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో కూడా ప్రమాదం పొంచి ఉంది. ఇంగ్లండ్ సిరీస్ చేదు జ్ఞాపకాల నుంచి బయటపడి టోర్నీని గెలవడం అనుకున్నంత తేలిక కాదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లికి విశ్రాంతి ఇచ్చారు. అతను ఈ టోర్నీలో ఆడడంతో లేదు. దీంతో జట్టు సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించారు. ఈ టోర్నీలో గెలిచి పూర్వ వైభవం సాధించాలని భారత్ తహతహలా డుతోంది. అయితే సుదీర్ఘ కాలం గా సాగిన ఇంగ్లండ్ సిరీస్‌లో ఆడి న చాలా మంది ఆటగాళ్లు ఆసియాకప్‌లోనూ ఆడనున్నారు. దీంతో వారు విశ్రాంతి లేకుండానే ఈ టోర్నీకి సిద్ధం కావాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో వారు ఎలా ఆడుతారనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

రోహిత్, ధావన్‌లే కీలకం…
ఇక, టోర్నీలో భారత్ ఆశలన్నీ ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలపై ఆధారపడి ఉన్నాయి. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో శిఖర్ ధావన్ పేలవమైన ఆటతో నిరాశ పరిచాడు. ఇక, కెప్టెన్ రోహిత్ శర్మ కు టెస్టు జట్టులో చోటు లభించలేదు. కాగా, ఆసియాకప్‌లో ఇద్దరు జట్టుకు చాలా కీలకంగా మారారు. విరా ట్ కోహ్లి లేని జట్టులో వీరి ప్రాధాన్యత మరింత పెరిగింది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా కలిగిన రోహిత్, ధావన్‌లు మెరుగైన ఆరంభాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎంతైన ఉంది. వీరిద్దరూ చెలరేగితే నే భారత్‌కు గెలుపు అవకాశాలు అధికంగా ఉంటాయి. వన్డేల్లో వీరిద్దరికి మం చి రికార్డు ఉండడమే దీనికి కారణం. ఓపెనర్లు శుభారంభం అందిస్తే వచ్చే ఆటగాళ్లపై భారం ఉండదు. వారు స్వేచ్ఛగా ఆడే అవకాశం కలుగుతోంది.

ఇదే మంచి తరుణం..
మరోవైపు వన్డే జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్న లోకేశ్ రాహుల్, మనీష్ పాండే, అంబటి రాయుడు, దినేష్ కార్తీక్‌లకు ఆసియా కప్ మంచి వేదికగా మారింది. ఇం దులో రాణించడం ద్వారా రానున్న సిరీస్‌లలో జట్టులో స్థానాన్ని పదిలం చేసుకునే అవకాశం వీరికి దొరికింది. దీనిలో వీరు ఎంత వరకు సఫలమవుతారనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. మనీష్‌పాండే ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఎన్ని అవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేక పోతున్నాడు. కనీసం ఈసారైన అతను మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాల్సిన అవసరం ఉంది. ఇక, లోకేశ్ రాహుల్‌ది కూడా ఇలాంటి పరిస్థితే. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో ఘోర వైఫల్యం చవిచూశాడు. అయితే చివరి టెస్టు రెండో ఇ న్నింగ్స్‌లో సెంచరీ సాధించడం కాస్త ఊరటనిచ్చే అంశం.

మళ్లీ ఫాంలోకి వచ్చిన రాహుల్ ఆసియాకప్‌లో మెరుపులు మెరిపించాలని భావిస్తున్నాడు. కోహ్లి లేని సమయంలో రాహుల్ బాధ్యత మరింత పెరిగింది. అతను ఎలా రాణిస్తాడనే దానిపైనే భారత్ గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. ఇక, చాలా కాలం తర్వాత జట్టులో చోటు సంపాదించిన అంబటి రాయుడికి కూడా ఆసియాకప్ పరీక్షగా మారింది. ఇంగ్లండ్ సిరీస్‌కు ఎంపికైన యోయో టెస్టులో ఫెయిలై జట్టుకు దూరమయ్యాడు. ఫిట్‌నెస్ టెస్టు నెగ్గడంతో తాజాగా ఆసియాకప్‌కు ఎంపిక చే శారు. ఈసారి అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే లక్షంతో ఉన్నాడు. మరోవైపు ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఘోర వైఫల్యం చవిచూసిన దినేష్ కార్తీక్‌కు ఆసి యా కప్ సవాలుగా తయారైం ది. వరుసగా అవకాశాలు లభిస్తున్నా కార్తీక్ దాన్ని సద్వినియోగం చేసుకోలేక పోతున్నాడు.

ఈసారి అతనిపై జ ట్టుకు భారీ ఆశలే ఉన్నా యి. అయితే అతను ఎలా రాణిస్తాడో వేచి చూడక తప్పదు. హార్దిక్ పాండ్య ఇటు బంతితో అటు బ్యాట్‌తో చెలరేగాలని భావిస్తున్నాడు. చా లా కాలంగా జట్టులో స్థానాన్ని నిలబెట్టుకుంటున్నా ఫలితం లేకుండా పోయిం ది. అడపాదడపా మాత్రమే మెరుస్తున్నాడు. ఈసారి విఫలమైతే మాత్రం జ ట్టులో స్థానం కోల్పోవడం ఖాయమనే చెప్పాలి. ఈ పరిస్థితుల్లో మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు తహతహలాడుతున్నా డు. ఇదిలావుండగా వన్డేల్లో ఒకప్పు డూ అద్భుత ఆటగాడిగా పేరు తెచ్చుకున్న కేదార్ జాదవ్ ఇటీవల కాలంలో వరు స వైఫల్యాలు చవిచూస్తున్నా డు. తాజాగా అతనికి మరో ఛాన్స్ లభించింది. ఇందులో సఫలమైతేనే భవిష్యత్తులో జ ట్టులో దక్కే అవకాశం ఉంది.

ధోనిపైనే భారం..
కెప్టెన్ విరాట్ కోహ్లికి విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని బాధ్యతలు మరింత పెరిగాయి. అతను అందించే సలహాలు, సూచనలు కెప్టెన్ రోహిత్‌కు చాలా కీలకం. సలహాలతో పాటు బ్యాట్‌తోనూ ధోని పని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎంతో అనుభవజ్ఞుడైన ధోని కొంత కాలంగా ఆశించిన స్థాయిలో ఆడలేక పోతున్నాడు.

ఈ నేపథ్యంలో ధోనిని తప్పించాలనే డిమాండ్ ఊపంకుంది. రానున్న ప్రపంచకప్ నాటికి జట్టులో స్థానాన్ని కాపాడుకోవాలంటే ధోని తన బ్యాటింగ్‌కు పదును పెట్టక తప్పదు. ఆసియాకప్‌లో జట్టులో అతనే కీలకంగా మారాడు. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్ని ఇప్పటికీ జట్టును తెరవెనుక నుంచి నడిపించేది ధోని మాత్రమే. కోహ్లి లేని సమయంలో ధోని మరింత కీలకంగా మారాడు. వికెట్ కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా, సీనియర్‌గా ధోని బాధ్యతలు సమర్థంగా నిర్వహించాల్సిన అవసరం ఎంతైన ఉంది.

బౌలింగే బలం..
ఆసియాకప్‌లో భారత్ మరోసారి బౌలింగ్‌ను నమ్ముకుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు భారత్‌కు అందుబాటులో ఉన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లుగా పేరు తెచ్చుకున్న జస్‌ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఆసియాకప్‌లో ఇద్దరు జట్టుకు కీలకంగా మారారు.

ఎటువంటి బ్యాటింగ్ లైనప్‌నైన చిన్నాభిన్నం చేసే సత్తా వీరికుంది. ఈ టోర్నీలో కూడా జట్టు వీరిపై భారీ ఆశలు పెట్టుకుంది. ఇక, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌ల రూపంలో మ్యాచ్ విన్నర్ స్పిన్న ర్లు ఉండనే ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు పలు సిరీస్‌లలో భారత్‌కు ఒంటిచేత్తో వి జయాలు సాధించి పెట్టారు.

ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే లక్షంతో ఉన్నారు. అక్షర్ పటేల్ రూపంలో మరో మెరుగైన అస్త్రం భారత్‌కు అందుబాటులో ఉంది. హార్దిక్ పాండ్య, శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్‌లతో భారత బౌలింగ్ చాలా బలంగా ఉంది. దీంతో ఈసారి కూడా ఆసియా కప్‌లో భారత్‌కు బౌలింగ్ ప్రధాన ఆయుధంగా మారింది.