Search
Monday 24 September 2018
  • :
  • :

టీమిండియా ఉత్కంఠ విజయం

India sneak home against England

నాగ్‌పూర్: సొంతగడ్డపై వరుస పరాజయాల అనంతరం భారత మహిళల జట్టు ఎట్టకేలకు ఓ అద్భుత విజయాన్ని సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్ మహిళల జట్టుతో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో భారత్ ఒక్క వికెట్ తేడాతో ఉత్కంఠ విక్టరీతో గట్టేక్కింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 49.3 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాట్స్ ఉమెన్లలో ఫ్రాన్ విల్సన్ 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ 4, ఏక్తా బిస్త్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 208 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 49.1 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తన ఫామ్ ను కొనసాగిస్తూ స్మృతి మంధాన 109 బంతుల్లో 5ఫోర్లు, 4సిక్సర్లతో 86 పరుగులు చేసింది. మంధాన మెరుపు ఇన్నింగ్స్ భారత జట్టుకు అద్భుత విజయాన్ని అందించింది. మిడిలార్డర్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్(21), దీప్తి శర్మ(24) మాత్రమే రాణించారు. మిగతా క్రీడాకారిణులు ఘోరంగా విఫలమయ్యారు.

Comments

comments