Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ఆసియా కప్ ఆడే భారత జట్టు ఇదే

India squad for asia cup 2018

ముంబయి: ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్‌కు భారత జట్టును ఎంపిక చేశారు. చీఫ్ సెలక్టర్ ఎంఎస్ కె ప్రసాద్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ శనివారం 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలెక్టర్లు ఈ టోర్నీలో విశ్రాంతి ఇచ్చారు. కోహ్లీ స్థానంలో సారథ్య బాధ్యతలు రోహిత్ శర్మకు అప్పగించారు. అలాగే వైస్ కెప్టెన్‌గా శిఖర్ ధావన్‌ను ఎన్నుకున్నారు. జట్టులోకి కొత్తగా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్(రాజస్తాన్) వచ్చాడు. కేదార్ జాదవ్, భువనేశ్వర్ కుమార్, అంబటి రాయుడు తిరిగి జట్టులోకి వచ్చారు. సురేష్ రైనాకు జట్టులో చోటు దక్కలేదు.

భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్(వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్, అంబటి రాయుడు, మనీష్ పాండే, కేదార్ జాదవ్, మహేంద్ర సింగ్ ధోనీ, దినేష్ కార్తీక్, హర్దీక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్.

Comments

comments