Home తాజా వార్తలు ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ఎంపిక

ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ఎంపిక

BCCI-2

ముంబయి: ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సోమవారం భారత జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా, అజింక్య రహానేను వైస్ కెప్టెన్‌గా నియమించింది. ఇక గాయం కారణంగా గత కొన్ని నెలలుగా జట్టుకు దూరమైన ఓపెనర్ రోహిత్ శర్మ, మీడియం పేసర్ మహ్మద్ షమీ తిరిగి జట్టులోకి వచ్చారు.

ఐపిఎల్‌లో రాణిస్తున్న కోల్‌కతా కెప్టెన్ గౌతం గంభీర్‌తో పాటు స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కు ఈసారి చోటు దక్కలేదు. మనీష్‌పాండే, యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్ తమ స్థానం పదిలం చేసుకున్నారు. జూన్ 1 నుంచి 18 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. ఇక బిసిసిఐ ప్రకటించిన 15 మందితో కూడిన భారత జట్టు వివరాలు ఇలా ఉన్నాయి.

టీమిండియా: విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్య రహానే(వైస్ కెప్టెన్), ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, ఆర్. అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా