Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

అతడి దూకుడే భారత జట్టుకు బలం:సచిన్

  Sachin

ఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడిన తొలి మ్యాచ్ నుంచి ఇప్పటివరకు అతడిలో దూకుడు తగ్గలేదని మాస్టర్ బ్లాస్టర్ సచ్చిన్ టెండూల్కర్ కొనియాడారు. కోహ్లీ ఆడే విధానం మారిందని ప్రశంసించారు. విరాట్ అరంగేట్రం చేసిన మ్యాచ్‌లో అతడి దూకుడు గుర్తించానని, ఇదే దూకుడు ఇంకా చూస్తున్నానని తెలిపారు. దూకుడుగా ఉన్నవారిపై ఎక్కువగా విమర్శలు వస్తాయని, కానీ కోహ్లీ దూకుడు భారత జట్టుకు ప్లస్ అయిందన్నారు. కోహ్లీ దూకుడే టీమిండియాకు బలమని తాను నమ్ముతున్నానన్నారు. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ సెంచరీ చేయడంతో రికీ పాంటింగ్ రికార్డును అధిగమించిన విషయం తెలిసిందే.

Comments

comments