Search
Saturday 17 November 2018
  • :
  • :

భారత్ టార్గెట్ 199

ind

బ్రిస్టల్: మూడో టి-20 మ్యాచ్‌లో ఇంగ్లండ్, భారత్ కు 199 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. ఓపెనర్లు చెలరేగడంతో ఇంగ్లండ్‌  పవర్‌ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 73 పరుగులు చేసింది.అయితే సిద్ధార్త్ కౌల్ వేసిన 8వ ఓవర్‌లో జాస్ బట్లర్(34) క్లీన్ బౌల్డ్ కాగా, ఆ తర్వాత దీపక్ చాహర్ వేసిన 10వ ఓవర్‌లో తొలి బంతికి సిక్సర్ బాదిన జేసన్ రాయ్(67) ఆ తర్వాత బంతికి కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ దశలో హేల్స్ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. అయితే భారత్ యువ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా తన వరుస ఓవర్లలో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లను పెవిలియన్కు పంపాడు. 14వ ఓవర్‌లో మెర్గన్(6), హేల్స్(30), 18వ ఓవర్‌లో బెన్ స్టోక్స్(14), జానీ బ్రిస్టో(25)ల వికెట్లు తీసి ఇంగ్లాండ్ కు జలక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు పెద్దగా రాణించకపోవడంతో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి.. 198 పరుగులు చేసింది. భారత బౌలింగ్‌లో హార్థిక్ 4, కౌల్ 2, చాహర్, యాదవ్ తలో వికెట్ తీశారు.

Comments

comments