Search
Monday 16 July 2018
  • :
  • :
Latest News

తిప్పేసిన కుల్దీప్.. భారత్ లక్ష్యం 269

duldeep

నాటింగ్‌హమ్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ట్రెంట్‌బ్రిడ్జ్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌యాదవ్‌(25/6) మరోసారి తిప్పేశాడు. కుల్దీప్ తొలి ఓవర్‌లోనే వికెట్‌ తీసి ఇంగ్లాండ్‌ పతనాన్ని శాసించాడు. తన మణికట్టు  మాయజాలంతో  ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లకు చుక్కలు చూపించాడు దీంతో తొలి వన్డేలో ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 268 పరుగులకే ఆలౌటయ్యింది. తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేసిన ఇంగ్లాండ్‌, కుల్దీప్ దెబ్బతో  11 బంతుల వ్యవధిలో మూడు వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లాండ్ 82/3గా నిలిచింది. కల్దీప్ వరుస ఓవర్లో జాసన్ రాయ్ (38), రూట్ (3), బెయిర్ స్టో (38)లను పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత  చాహల్  కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ (19)ను పెవిలియన్ పంపగా..  స్టోక్స్, బట్లర్‌, డేవిడ్ విల్లేలను కుల్దీప్ పెవిలియన్ చేర్చాడు. కాసేపటికే మొయిన్ అలీ (24), అదిల్ రషీద్ (22)లను ఉమేష్ యాదవ్ పెవిలియన్ పంపడంతో ఇంగ్లాండ్ 268 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ గడ్డ మీద ఇంగ్లాండ్‌పై వన్డేల్లో ఐదు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా కుల్దీప్ రికార్డు నెలకొల్పాడు. వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా కుల్దీప్ (25 పరుగులిచ్చి 6 వికెట్లు) సరి కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు.

Comments

comments