Home తాజా వార్తలు భారత్‌కు భారీ లక్ష్యం..

భారత్‌కు భారీ లక్ష్యం..

c

లండన్‌:  లార్డ్స్‌ వేదికగా జరుగుతోన్న భారత్‌-ఇంగ్లండ్‌ రెండో వన్డేలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లడ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లను కోల్పొయి 322 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్స్ లో జేసన్‌ రాయ్‌ 40, జానీ బెయిర్‌స్టో 38, మోర్గాన్‌ 53, జోయీ రూట్ 113 (నాటౌట్), బెన్‌ స్టోక్స్‌ 5, జోస్‌ బట్లర్‌ 4, మోయీన్‌ అలీ 13, డేవిడ్‌ విల్లే 50 (రనౌట్‌) పరుగులు రాబట్టారు. ఎక్స్‌ట్రాల రూపంలో ఆ జట్టుకు 4 పరుగులు లభించాయి. భారత్ బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 3 వికెట్లు పడగొట్టగా, ఉమేశ్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, యజువేంద్ర చాహెల్‌లకు తలో వికెట్ తీశారు.