Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

శ్రీలంకకు బయలుదేరిన టీమిండియా

india

ముంబయి: ముక్కోణపు ట్వంటీ20 సిరీస్‌లో పాల్గొనేందుకు భారత క్రికెట్ జట్టు ఆదివారం శ్రీలంక బయలుదేరి వెళ్లింది. మూడు దేశాల టోర్నమెంట్‌లో భారత్ తలపడనుంది. ఈ టోర్నీలో భారత్‌తో పాటు ఆతిథ్య శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు పాల్గొంటున్నాయి. కాగా, ఈ సిరీస్‌లో పాల్గొనే టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. శిఖర్ ధావన్ వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఇదిలావుండగా కెప్టెన్ విరాట్ కోహ్లి, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిలతో పాటు కీలక బౌలర్లకు విశ్రాంతి ఇచ్చారు. దీంతో పలువురు సీనియర్లు లేకుండానే భారత్ టోర్నీలో తలపడనుంది. స్పీడ్‌స్టర్లు భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రిత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లకు సిరీస్‌కు ఎంపిక చేయలేదు. వీరి బదులు పలువురు యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇచ్చారు. యువ ఆటగాడు రిషబ్ పంత్ టోర్నీకి ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాడు. విజయ్ శంకర్ కూడా జట్టులో చోటు సంపాదించాడు. వాషింగ్టన్ సుందర్, హైదరాబాదీ స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్‌లు కూడా టోర్నీకి ఎంపికయ్యారు. ఇదిలావుంగా ముక్కోణపు టోర్నమెంట్ మంగళవారం ప్రారంభం కానుంది. కాగా, టోర్నీ కోసం ముంబయి నుంచి టీమిండియా లంకకు బయలుదేరి వెళ్లింది. ఈ సందర్భంగా ఆటగాళ్ల ఫొటోలను బిసిసిఐ ట్వీటర్‌లో పోస్ట్ చేసింది.

Comments

comments