Search
Wednesday 26 September 2018
  • :
  • :

హాకీ ప్రపంచకప్ లో భారత్ ఓటమి

hocky

లండన్: మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత హాకీ జట్టు పరాజయం పాలైంది. ఈ టోర్నీలో భాగంగా గురువారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 1-0 తేడాతో ఓడిపోయింది. మ్యాచ్‌ ప్రారంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మ్యాచ్ 13వ నిమిషం వద్ద ఐర్లాండ్ క్రీడాకారిణి అన్నా ఓఫ్లాంనగాన్ పెనాల్టీ కార్నర్‌ని గోల్‌గా మలిచి ఐర్లాండ్ కు 1-0 అధిక్యాన్ని అందించింది. ఆ తర్వాత భారత్‌కు రెండు సార్లు పెనాల్టీ కార్నర్ వచ్చిన గోల్ సాధించలేకపోయింది. కాగా మ్యాచ్ సమయం ముగిసే సమయానికి ఐర్లాండ్ 1-0 అధిక్యంలో నిలిచింది.దీంతో ఐర్లాండ్, భారత్ పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కి ప్రవేశించింది.

Comments

comments