Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

కర్ణాటకలో హంగ్..!?

India Today Karvy Opinion Poll says Hung in Karnataka

బెంగళూరు: కర్ణాటకలో ప్రస్తుతం ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాయి. మే 12 నుంచి 15 వరకు మొత్తం 224 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరించనుందనేది ఇప్పుడు సర్వాత్ర చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో రాష్ట్రంలో హంగ్ ఏర్పడే అవకాశం ఉందంటూ ఓ సర్వే వెల్లడించింది. తాజాగా కర్ణాటక ఎన్నికలపై వెలువడిన ఇండియా టూడే-కార్వీ ఒపీనియన్ పోల్ ఫలితాలను గమనిస్తే… కాంగ్రెస్ పార్టీ 90-101 సీట్లు గెలిచి మరోసారి పెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని తెలిపింది. అలాగే బిజెపి 78-86 స్థానాలు కైవసం చేసుకోనుందట. జెడిఎస్ 34-43 సీట్లు గెలవడంతో పాటు ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానుందని చెబుతోంది. ఇతరులు 4-7 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందట. అంతేగాక 33శాతం ఆ రాష్ట్ర ప్రజలు సిద్ధరామయ్యనే సిఎంగా కోరుకుంటున్నారని ఇండియా టూడే రిపోర్ట్ స్పష్టం చేసింది.

Comments

comments