Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

విరాట్‌కు ఐసిసి టెస్ట్ ఛాంపియన్‌షిప్ మేస్ బహూకరణ

మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత ఐసిసి టెస్ట్ ఛాంపియన్‌షిప్ మేస్ అందుకున్న రెండో భారతీయ కెప్టెన్ విరాట్ కోహ్లి. మొత్తంగా చూసినప్పుడు ఈ మేస్‌ను అందుకున్న 10వ క్రికెటర్.
kohliఇండోర్: భారత్-న్యూజిలాండ్ మూడో టెస్ట్ ఇండోర్‌లో ముగిశాక తన జట్టును టాప్‌లో నిలబెట్టినందుకు విరాట్ కోహ్లికి మంగళవారం ఐసిసి టెస్ట్ ఛాంపియన్‌షిప్ మేస్(గద)ను బహూకరించారు. దీనిని ఐసిసి తరపున భారత జట్టు మాజీ కెప్టెన్, క్రికెటర్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అతడికి బహూకరించారు. భారత్ జట్టు, న్యూజిలాండ్ జట్టును 321 పరుగుల తేడాతో ఓడించి 3-0తో క్లీన్ స్వీప్ చేసి సిరీస్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్ ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్‌లో దాయాది పాకిస్థాన్ జట్టును వెనక్కి నెట్టేసి అగ్రస్థానానికి చేరుకుంది. ఐసిసి టెస్ట్ ఛాంపియన్‌షిప్ మేస్‌ను అందుకున్నందుకు ఆనందిస్తున్నానని కోహ్లి ఆ సందర్భంగా అన్నారు. ఈ మేస్‌ను ఇదివరలో ఇతర కెప్టెన్లు స్టీవ్ వాగ్, రికీ పాంటింగ్, మైకేల్ క్లార్క్, స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా), ఆండ్రూ స్ట్రాప్(ఇంగ్లండ్), గ్రేమ్ స్మిత్, హాషిమ్ ఆమ్లా(దక్షిణాఫ్రికా-రెండు) మిస్బా-ఉల్-హఖ్(పాకిస్థాన్) అందుకున్నారు. ఈ ఘనత అంతా జట్టును టాప్‌కు తీసుకెళ్లిన క్రికెటర్లదేనని కోహ్లి అభిప్రాయపడ్డారు. తనకు మద్దతు ఇచ్చిన జట్టులోని ప్రతి క్రికెటర్‌కు కృతజ్ఞతలు అందజేస్తున్నానని కూడా అన్నారు. టెస్టుల్లో భారత్ జట్టు మళ్లీ నెం.1 స్థానాన్ని పొందినందుకు ఐసిసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్‌సన్ ఎంతగానో ప్రశంసించారు. కొన్ని వారాల్లోనే పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టి మళ్లీ టాప్ ర్యాంకింగ్ పొందడం ఘనంగా ఉందన్నారు. కొన్ని నెలల్లోనే టాప్ నెం.1 ర్యాంకింగ్ మూడుసార్లు మారిందని, భారత్ ఈ స్థానాన్ని మరి కొన్ని నెలలపాటైనా స్థిరంగా నిలుపుకుంటుందని ఆశిస్తున్నానని అన్నారు.

Comments

comments