Home స్కోర్ ఇరగదీసిన ధోనీ

ఇరగదీసిన ధోనీ

అంబటి రాయుడు శతకం

యువీ, ధవన్ హాఫ్ సెంచరీలు

ఇంగ్లాండ్ లెవెన్‌తో భారత్-ఎ ప్రాక్టీస్ మ్యాచ్

cricముంబై: ఈ మధ్య స్థాయికి తగ్గట్టుగా బ్యాటింగ్‌లో రాణించలేక పోతున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తాజా గా ఫామ్ పంజుకుని ఇంగ్లాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఇరగదీశాడు. ఇంగ్లాండ్ లెవెన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో మునుపటి ధోనీని గుర్తుకు తెస్తూ బ్యాట్‌తో రెచ్చిపోయాడు. భారత జట్టులో పునరాగమనం కోసం కొంతకాలంగా ఎదురుచూస్తున్న అంబటి రాయుడు శతకం బాది సత్తా చాటుకున్నాడు. అలాగే మూడేళ్ల త ర్వాత వన్డే జట్టులోకి వచ్చిన యువరాజ్ సింగ్ హాఫ్ సెంచరీతో రా ణించాడు. దీంతో భారత్-ఎ జట్టు భారీ స్కోరు సాధించింది. ముం బైలో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్-ఎ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. రాయుడు 97 బంతుల్లో11 ఫోర్లు, సిక్సర్ సా యంతో శతకాన్ని నమోదు చేశాడు. ఆ తర్వాత రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఐదో నెంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన మహేందర్ సింగ్ ధోనీ తనదైన శైలిలో ఆడి 40 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల తో అజేయంగా 68 పరుగులు చేశాడు. శిఖర్ ధవన్ (63), యువ రాజ్ (48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 56) హాఫ్ సెంచరీలు చే శారు. రాయుడు నిలకడగా రాణించగా, ధోనీ, యువీ దూకుడుగా ఆడి అభిమానుల్ని ఆకట్టుకున్నారు. బెస్ట్ మ్యాచ్ ఫినిషర్‌గా పేరు న్న ధోనీ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత తన సత్తా ఏమిటో చాటా డు. ఇంగ్లాండ్ బౌలర్లు జాక్ బాల్, డేవిడ్ విల్లీ రెండేసి వికె ట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మ న్ దూకుడుగా ఆట మెదలుపెట్టారు. 95 పరుగుల వరకూ ఒక్క వికెట్ పడలేదు. నెహ్రా, హార్ధిక్ పాండ్యా, మోహిత్ శర్మలు 15 ఓవర్లపాటు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో ‘కూల్ కెప్టెన్’ ధోనీ తన స్కెచ్ మార్చి కుల్దీప్ యాదవ్, చాహల్‌లను రం గంలోకి దించాడు. అంతే వెంట వెంటనే వరుస ఓవర్లలో మూడు వికెట్లు పడ్డాయి. దీంతో అదుపు తప్పుతున్న మ్యాచ్ పరిస్థితి భారత్ కనుకూలంగా మారింది. ఓపెనర్లు జాసన్ రాయ్ 62, అలెక్స్ హే ల్స్ 40 పరుగుల వద్ద ఉండగా తన మొదటి రెండు ఓవర్లలోనే కుల్దీప్ యాదవ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లోనే చాహల్ మూ డో వికెట్‌గా ఇయాన్ మోర్గాన్‌ను 3 పరుగుల వద్ద పెవీలియన్‌కు పం పాడు. అయితే ధోనీ ఇక్కడ కుల్దీప్ యాదవ్‌తో మూడు ఓవర్లు మాత్రమే వేయించి మళ్లీ మోహిత్ శర్మను రంగంలోకి దించాడు. ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ లెవన్ జట్టు స్కోర్ 20 ఓవర్లు ముగిసే సమయానికి 122/3. మ్యాచ్ గెలిచేందుకు ఇంకా 183 పరుగులు చేయాల్సి ఉంది. ఇంగ్లాండ్ తో టి-20, వన్డే సిరీస్‌లకు టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లిని నియమించిన సంగతి తెలిసిందే. కాగా ఈ వార్మప్ మ్యాచ్‌కు మాత్రం ధోనీకి సారథ్య బాధ్యతలు అప్పగించారు.
భారత్-ఎ ఇన్నింగ్స్ : 304/5(50 ఓవర్లు)
మన్‌దీప్ సింగ్ (బి)విల్లీ 8, ఎస్.ధవన్ (సి)బట్లర్(బి)బాల్ 63, ఎ.టి.రాయుడు (రిటైర్డ్ ఔట్) 100, యువరాజ్ సింగ్ (సి)రషీద్(బి)బాల్ 56, ఎం.ఎస్.ధోనీ (నాటౌట్)68, ఎస్.వి.శామ్‌సన్ (సి)హేల్స్(బి)విల్లీ 0, హెచ్.హెచ్.పాండ్య (నాటౌట్)4, ఎక్స్‌ట్రాలు: 4. వికెట్ల పతనం: 1-25, 2-136, 3-227, 4-250, 5-257. బౌలింగ్: సి.ఆర్.వోక్స్ 10-1-71-0, డి.జె.విల్లీ 10-1-55-2, ఎం.ఎం.అలీ 10-0-61-2, జె.టి.బాల్ 10-0-61-2, ఎ.యు.రషీద్ 8-0-49-0, ఎల్.ఎ.డాసన్ 2-0-24-0.
ఇంగ్లాండ్ ఎలెవెన్ ఇన్నింగ్స్: (లక్షం 50 ఓవర్లలో 305 పరుగులు)
జె.జె.రాయ్ (సి) శర్మ(బి)కుల్దీప్ యాదవ్ 62, ఎ.డి.హేల్స్ (సి)శామ్‌సన్(బి) కుల్దీప్ యాదవ్ 40, ఎస్.డబ్లు. బిల్లింగ్స్(నాటౌట్) 41, ఇజెజి మోర్గాన్ (సి)ధావన్(బి)చహల్ 3, జె.సి.బట్లర్ (సి)శర్మ(బి)కుల్దీప్ యాదవ్ 46, ఎం.ఎం .అలీ ఎల్‌బిడబ్లు (బి)కుల్దీప్ యాదవ్ 0, ఎల్.ఎ.డాసన్ (నాటౌట్) 9, ఎక్స్‌ట్రాలు: 3, వికెట్ల పతనం: 1-95, 2-106, 3-112, 4-191, 5-191.బౌలింగ్: ఎ.నెహ్రా 4-0-33-0, హెచ్.హెచ్.పాండ్య 51-16-0, ఎం.ఎం.శర్మ 8-0-54-0, వై.ఎస్.చాహల్ 8-0-40-1, కుల్దీప్ యాదవ్ 7-0-40-4, యువరాజ్ సింగ్ 3.3-0-30-0.