Home స్కోర్ రూట్ పడింది!

రూట్ పడింది!

గట్టి పునాది వేసిన జో  మోయిన్ ఆలీ  భారీ స్కోరు దిశగా ఇంగ్లాండ్

testరాజ్‌కోట్: భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో భాగంగా ఇక్కడి సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో  బుధవారం జరిగిన తొలి టెస్టు మొదటి రోజున  ఇంగ్లాండ్‌ss జట్టు పటిష్ట స్థితి(కమాండింగ్ పొజిషన్)ని సాధించింది. పర్యాటక జట్టు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. భారత్ బౌలర్లు మొదట కొన్ని వికెట్లు తీసి ఇంగ్లాండు జట్టును కంగారు పెట్టినా తర్వాత జో రూట్, మోయిన్ ఆలీ 179 పరుగుల భాగస్వామ్యం ఇంగ్లాండ్ జట్టును భారీ స్కోరులో నిలబెట్టింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ మొదట బ్యాటింగ్‌ను ఎంచుకున్నారు. తొలిసారిగా అంతర్జాతీయ టెస్టు ఆడుతున్న 19 ఏళ్ల హషీం హమీద్, కెప్టెన్ అలస్టెయిర్ కుక్ ఓపెనర్లుగా బ్యాటింగ్‌కు దిగారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ ఓపెనర్లు ఆచితూచి జాగ్రత్తగా ఆడడం  మొదలెట్టారు. అయితే పేసర్లయిన మొహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్‌లు తమ పేస్, స్పిన్ బాల్స్‌తో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మనెలను తొలుత చికాకుపరిచారు. బ్యాటింగ్‌ను ఎంచుకున్న ఇంగ్లాండ్ కెప్టెన్‌కు మొదట్లోనే చేదనుభవం ఎదురైంది. మొదటి ఓవర్లోనే అతడు ఔట్ కావలసింది. కానీ అజింక్యా రహానె అనూహ్యంగా బంతిని డ్రాప్ చేయడంతో అతడు బతికిపోయాడు. ఆ క్యాచ్‌ను రహానె పట్టి ఉంటే తన ఖాతాను తెరచి ఉండేవాడు. ఆ తర్వాత హమీద్ క్యాచ్‌ను కూడా స్లిప్‌లోని ఫీల్డర్స్ వదిలేశారు. కానీ ఈసారి క్యాచ్‌ను వదిలేసింది మాత్రం మురళీ విజయ్.కుక్‌ను రవీంద్ర జడేజా పెవిలియన్‌కు పంపే వరకు ఈ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌లు 47 పరుగుల భాగస్వామ్యం చేశారు. ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ కుక్ తన 21 పరుగుల స్కోరులో ఉండగా ఎడమచేతి వాటం స్పిన్నర్ రవీంద్ర జడేజా వికెట్ ముందు అతడిని ట్రాప్ చేశాడు. తొలిసారి టెస్టు ఆడుతున్న హమీద్ బాగా రాణించాడు. అయితే ఈ టీనేజర్ క్రికెటర్‌ను స్పిన్ దిగ్గజం అశ్విన్ పెవిలియన్‌కు పంపాడు. అతడు తన 31 పరుగుల స్కోరులో ఉండగా అతడి వికెట్‌ను పడగొట్టాడు. బెన్ డకెట్ కేవలం 13 పరుగుల వ్యక్తిగత స్కోరులో ఉండగా అశ్విన్ అతడి వికెట్‌ను తీశాడు.  3 వికెట్ల నష్టానికి 102 పరుగుల స్కోరులో ఉన్న ఇంగ్లాండ్ జట్టు చాలా  ఇబ్బందికర పరిస్థితిలో పడిపోయింది. కానీ జో  రూట్, మోయిన్ ఆలీ భారత్ బౌలర్లను చెండాడేసి ఇంగ్లాండును భారీ స్కోరులో నిలిపేసరికి ఆ జట్టు మొదటి రోజు పటిష్ట స్థాయికి చేరుకుంది. రూట్ కొన్ని అద్భుత షాట్లు కొట్టాడమే కాకుండా ఆసియాలో తన తొలి  శతకాన్ని చేశాడు. ఇక మోయిన్ ఆలీ రెండో అత్యధిక స్కోరర్(సెకండ్ ఫిడిల్)గా చెలరేగిపోయి భారతీయ స్పిన్నర్లను చెండాడేశాడు. దాంతో ఇంగ్లాండ్ జట్టు 250 పరుగుల మార్క్‌ను అధిగమించింది. నిలకడగా ఆడుతున్న రూట్ వికెట్‌ను ఉమేశ్ యాదవ్ తన బౌలింగ్‌లోనే క్యాచ్ చేసి ఔట్ చేశాడు. యువ క్రికెటర్ అయిన జో రూట్ జో సంచలనాత్మక 124 పరుగులు (11 x 4, 1 x 6) సాధించాడు. బెన్ స్టోక్‌తో కలసి మోయిన్ ఆలీ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను ఇబ్బందంటూ ఉండని స్కోరుకు(311/4) చేర్చాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి మోయిన్ ఆలీ శతకానికి కేవలం 1 పరుగు చేయాల్సిన స్థితిలో నిలిచాడు.